రాష్ట్ర విభజన ప్రక్రియను ఉపసంహరించుకునేంత వరకు సమ్మె విరమించబోమని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియను ఉపసంహరించుకునేంత వరకు సమ్మె విరమించబోమని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింపజేసేందుకు మంత్రి వర్గ ఉపసంఘం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సచివాలయ ఉద్యోగులతో మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం సాయంత్రం భేటి అయ్యింది.
ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించాల్సిందిగా వారిని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. అయితే దీనిపై ఉద్యోగులు ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి చెప్పారు. సమ్మెతో కంటే విభజన వల్ల వచ్చే సమస్యలే ఎక్కువని సీమాంధ్ర ఉద్యోగులు చెప్పారు. సమ్మె చేయాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు.