తదుపరి ఆర్బీఐ గవర్నర్ సుబీర్ గోకర్న్?
తదుపరి ఆర్బీఐ గవర్నర్ సుబీర్ గోకర్న్?
Published Sat, Aug 6 2016 8:33 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా నూతన గవర్నర్ గా ఎవర్ని ఎంపిక చేయనున్నారనే వార్త మరోసారి ప్రముఖంగా నిలిచింది. రఘురాం రాజన్ తర్వాత ఎవరిని నియమిస్తారనే విషయంపై తాజాగా ఊహాగానాలు మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్న రాజన్తో శుక్రవారం సమావేశం కావాల్సి ఉందని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. ఆర్బిఐ కదలిక చర్చకు దారితీసింది. దేశంలోని అగ్రశ్రేణి ఆర్థిక సంస్థ, దేశ కేంద్ర బ్యాంక్ గవర్నర్ ఆయనే అనే అంచనాలు హాట్ టాపిక్ గా మారాయి.
కాగా రాజన్ పదవీకాలం పూర్తి కాకముందే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేసేది వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఎలాంటి వూహాగానాలకు తావులేదని ఇప్పటికే ఎంపిక ప్రక్రియ మొదలయ్యిందని వెల్లడించాయి. అలాగే నూతన గవర్నర్ ఎంపికకు ఎలాంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశాయి. అటు సెప్టెంబరు 4వ తేదీతో రాజన్ పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే.
Advertisement