‘నీట్‌’పై చర్చకు రెడీ: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Released Video On NEET Paper Leak Issue | Sakshi
Sakshi News home page

‘నీట్‌’పై ప్రభుత్వంతో చర్చకు రెడీ: రాహుల్‌ గాంధీ

Published Fri, Jun 28 2024 8:21 PM | Last Updated on Fri, Jun 28 2024 8:28 PM

Rahul Gandhi Realeased Video On Neet Paper Leak Issue

ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో  విడుదల చేశారు. నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం(జూన్‌28) లోక్‌సభలో నీట్‌ అంశం మాట్లాడుతుండగా తన మైక్‌ కట్‌ చేశారని మండిపడ్డారు.

 నీట్‌ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారని గుర్తు చేశారు. 

పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టడం వారి కల అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. విద్యార్థుల తరఫున పోరాడాలని నిర్ణయించామన్నారు. 

ఏడేళ్లలో 70సార్లు పలు పరీక్షల ప్రశ్న పేపర్‌లు లీక్‌ అయ్యాయని, లీకుల కారణంగా రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని రాహుల్‌ విమర్శించారు. దీనికి పరిష్కారం చూపాలని విద్యార్థులు ప్రధాని మోదీని కోరుతున్నా ఆయన మౌనం వీడట్లేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement