రూపాయి పతనంపై రాహుల్‌ ట్వీట్‌, వైరల్‌ | On Rupee Crash, Rahul Gandhi Taunts PM Modi With Masterclass Video | Sakshi
Sakshi News home page

రూపాయి పతనంపై రాహుల్‌ ట్వీట్‌, వైరల్‌

Published Tue, Aug 14 2018 8:09 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

On Rupee Crash, Rahul Gandhi Taunts PM Modi With Masterclass Video - Sakshi

రాహుల్‌ గాంధీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశీయ కరెన్సీ రూపాయి అమ్మ.. బాబోయ్‌ అనిపిస్తోంది. చరిత్రలో తొలిసారి అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పతనమైంది. డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ తొలిసారి రూ.70ను తాకింది. ఓ వైపు పొంచుకొస్తున్న టర్కీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు.. మరోవైపు డాలర్‌ బలపడుతుండటం రూపాయి విలువను మరింత దిగజారుస్తున్నాయి. రూపాయి విలువ భారీగా చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను తాకిన అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూపాయి విలువ పతనంపై ట్విటర్‌లో ఓ వీడియోను షేర్‌చేశారు. రూపాయి తమ అధినేతపై విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానిస్తూ... రాహుల్‌ చేసిన ట్వీట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  

మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. రూపాయి పతనాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై మోదీ చేసిన విమర్శల వీడియో ఇది. ‘ఈ వీడియోలో ఆర్థిక వ్యవస్థపై సుప్రీం లీడర్‌ ఇచ్చిన మాస్టర్‌ క్లాస్‌ను వినవచ్చు. ఎందుకు రూపాయి  పడిపోతుందో ఆయన వివరించారు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ, ఆర్థిక పరిణామాల కారణాలతోనే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ అవినీతి పాలనతోనూ రూపాయి విలువ పతనమవుతుందంటూ అప్పట్లో మోదీ విమర్శించారు. తాజాగా రూపాయి భారీగా పతనమవడంతో, ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. రాహుల్‌ ఈ ట్వీట్‌ చేశారు. 70 ఏళ్లలో మనం చేయలేనిది ఎట్టకేలకు మోదీ చేసి చూపించారని కాంగ్రెస్‌ నేతలు వెటకారంగా విమర్శిస్తున్నారు. 

రూపాయి పతనంపై రాహుల్‌ షేర్‌ చేసిన ఈ వీడియో బీజేపీ నాయకులను ఇరకాటంలో పడేసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు టర్కీ ఆర్థిక వ్యవస్థ మాంద్యమంలోకి వెళ్తుందనే సంకేతాల నేపథ్యంలో ప్రపంచ కరెన్సీలు కుప్పకూలుతున్నాయి. ఆ దేశ కరెన్సీ లీరా ఇప్పటికే పాతాళానికి జారిపోయింది. టర్కీ ఆర్థిక సంక్షోభం ఇటు యూరోపియన్‌ యూనియన్‌ను తాకుతోంది. దీంతో అక్కడి స్టాక్‌ మార్కెట్లనూ లీరా వెంటాడుతోంది. మొత్తం మీద టర్కీలో తలెత్తిన ఈ కరెన్సీ ముసలం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement