Rupee Crash
-
రూపాయి పతనంపై.. ఆందోళన అక్కర్లేదా?
‘‘భారత్ రూపాయి క్షీణించలేదు.కానీ వాస్తవానికి, అమెరికా డాలర్ బలపడింది’’ అంటూ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘ఈ ప్రకటనలో తప్పేముంది’ అని కొందరు ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడితే, ‘ఈ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది’ అంటూ కొందరు తమకు నచ్చిన విధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక ప్రతిపక్ష నాయకుల విమర్శలు సరేసరి. అయితే రూపాయి పతనంపై తక్షణం తీవ్ర ఆందోళన అక్కర్లేదన్న ధోరణితో సైతం ఆర్థికశాఖ వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలూ సీతారామన్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆయా అంశాలపై ఒక్కసారి దృష్టి సారిస్తే.. 20 ఏళ్ల గరిష్ట స్థాయిలో డాలర్ ఇండెక్స్ అక్టోబర్ 10వ తేదీన ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 82.40 స్థాయి వద్ద స్థిరపడింది. ఆ రోజు 82.68 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభంకాగా, ఒక దశలో 82.69 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడే, ముగింపు రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. నిజానికి డాలర్‌తో పాటు ఫారెక్స్ మార్కెట్లో వివిధ కరెన్సీలతో రూపాయి ట్రేడింగ్ జరుగుతుంది. అయితే అంతర్జాతీయ వాణిజ్య రంగంలో (రెండు ప్రపంచ యుద్ధాల విధ్వంసం, బ్రిటన్ తన బంగారం నిల్వల నుంచి భారీ వ్యయాల నేపథ్యంలో 1944 బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అగ్రగామి రిజర్వ్ కరెన్సీగా హోదాను స్టెర్లింగ్ నుంచి అమెరికా డాలర్ పొందింది) డాలర్‌కు ఉన్న ప్రాభల్యం దృష్ట్యా ప్రధానంగా అగ్రరాజ్య కరెన్సీతో రూపాయి మారకపు ట్రేడింగ్ విలువపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరి న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఆరు కరెన్సీల విలువలతో కూడా డాలర్ ఇండెక్స్ కదలికలు ఉంటాయి. డాలర్ విలువను ఈ ఇండెక్స్ ప్రధానంగా నిర్దేశిస్తుంది. యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనాలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రాతిపదికన డాలర్ ఇండెక్స్ అక్టోబర్ 10వ తేదీన (మన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసిన రోజు) 20 సంవత్సరాల గరిష స్థాయిలో 113పైకి ఎగసింది. రెండు పాయింట్లు తగ్గినా ఇప్పుడూ దాదాపు అదే స్థాయిలో పటిష్టంగా ఉంది. డాలర్ ఇండెక్స్ పెరిగిందెంతో.. రూపాయి అంతే పడింది... దేశ 14వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన 2014 మే నెలలో రూపాయి విలువ దాదాపు 58 వద్ద ఉంది. ఈ లెక్కన 2022 అక్టోబర్ 10వ తేదీనాటికి చూస్తే, రూపాయి విలువ దాదాపు 42 శాతం పతనమైంది. ఇక అంతర్జాతీయంగా ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, ఇది 79 నుంచి ఏకంగా 113 స్థాయికి చేరింది. అంటే డాలర్ ఇండెక్స్ కూడా దాదాపు 43 శాతం ఎగసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడ్డమే రూపాయి చరిత్రాత్మక పతనానికి కారణమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, డాలర్ బలపడ్డమే ఆ కరెన్సీతో రూపాయి పతనానికి కారణమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చేస్తున్న వాదన బహుశా ఇందుకే కావచ్చు. కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, దేశంపై క్రూడ్ బిల్లు భారం, ద్రవ్యోల్బణం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువకు చెక్ పెడుతున్నాయి. చర్యలూ కొనసాగుతున్నాయ్... డాలర్ మారకంలో రూపాయి తీవ్ర ఒడిదుడుకులను అడ్డుకోడానికి మరోవైపు ఆర్బీఐ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ, ఇందుకు ఫారెక్స్ నిల్వలను దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగా వినియోగించడం గమనార్హం. గత ఏడాది 642 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం దాదాపు 545 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం కట్టడితోపాటు ఫెడ్ ఫెండ్ రేటు పెంపు నేపథ్యంలో వెనుదిరుగుతున్న విదేశీ పెట్టుబడులను నిలువరించడానికీ రెపో రేటు పెంపు దోహదపడనుంది. మే నుంచి 4 దఫాల్లో రెపో రేటును ఆర్బీఐ 190 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.9 శాతానికి ఎగసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఈ నేపథ్యంలో రష్యాపై అగ్రరాజ్యం ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యలో రూపాయిని వినియోగించే చర్యలకూ కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనిపై స్పందన బాగున్నట్లు కూడా ఆర్థికశాఖ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆయా చర్యల నేపథ్యంలో ప్రస్తుతానికి రూపాయి పతనంపై తీవ్ర ఆందోళన అనవసరమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదా? 2022లో రూపాయి 8 శాతం బలహీనపడితే, అందులో ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన తర్వాత పతనమే అధికం. డాలర్ మారకంలో ప్రస్తుత రూపాయి విలువ పతనంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వర్గాలు భరోసాను ఇస్తున్నాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలను ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. యూరోసహా పలు ఇతర కరెన్సీలతో రూపాయి బలోపేతం కావడం ఇందులో ఒకటి. డాలర్ ఇండెక్స్‌లో పలు దేశాల కరెన్సీలు భారీ పతనాన్ని చూడ్డం రెండవది. ఈ రెండు అంశాలూ రూపాయి పతన నష్టాన్ని భర్తీ చేస్తాయన్నది నిపుణుల వాదన. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, కమోడిటీ ఎకానమీ అయిన ఇండోనేసియా, బ్రెజిల్ కరెన్సీలు మాత్రమే భారత్ కరెన్సీకన్నా కొంచెం బాగుండడం గమనార్హం. డాలర్ ఎగువబాటకు కారణం.. ఇందుకు సంబంధించిన అంశాలను 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. అప్పటి ఆర్థిక సంక్షోభం, ఈజీ మనీ అందుబాటులో భాగంగా జీరో స్థాయికి ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం నేపథ్యంలో 2008లో డాలర్ ఇండెక్స్70 స్థాయికి పడిపోయింది. అటు తర్వాత అంతర్జాతీయ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు సన్నాహాల నేపథ్యంలో 2010 నాటికి 90 స్థాయికి ఇండెక్స్ ఎగసింది. అనుకున్నమేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పురోగతి లేకపోవడంతో 2011 మేనాటికి తిరిగి డాలర్ ఇండెక్స్ తిరిగి 72 స్థాయిని చూసినా, అటు తర్వాత ముందుకే సాగింది. ట్రంప్ పాలనా కాలంలో ప్రపంచ వాణిజ్య యుద్ధం, కరోనా వంటి సమయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి, కఠిన ద్రవ్య విధానానికి ఫెడ్ మొగ్గుచూపడం వంటి అంశాలు డాలర్ ఇండెక్స్‌ను బలోపేతం చేస్తూ వచ్చాయి. దీనికితోడు ప్రపంచంలో తీవ్ర సంక్షోభ సమయాల్లో వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా, సురక్షిత పెట్టుబడిగా డాలర్లోకి పెట్టుబడులూ డాలర్ ఇండెక్స్ ఎల్లప్పుడూ లాభపడే అంశం. భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు, ఫెడ్ రేటు పెంపు ప్రస్తుతం డాలర్ బలానికి కలిసి వస్తున్న అంశాలు. – సాక్షి బిజినెస్ విభాగం -
రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గురువారం 26 పైసలు పతనమై 71.81 వద్ద ముగిసింది. గడచిన ఎనిమిది నెలల కాలంలో (డిసెంబర్ 14న 71.90) రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ భారీ పతనం, బయటకు వెళుతున్న విదేశీ నిధులు దీనికి కారణం. చైనా కరెన్సీ యువాన్ పతనం, వర్థమాన మార్కెట్ కరెన్సీల తీవ్ర ఒడిదుడుకులకు కారణమైంది. బలహీనధోరణిలో 71.65 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒక దశలో 71.97ను కూడా చూసింది. అంతర్జాతీయంగా పటిష్టంగా ఉన్న క్రూడ్ ధరలు సైతం రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోంది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డాలర్, క్రూడ్ ధరల పటిష్టత వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. -
స్టాక్ మార్కెట్లు భారీ పతనం
-
సెన్సెక్స్ భారీ పతనం
సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచి నెగిటివ్ సెంటిమెంట్‌తో నీరసపడిన కీలక సూచీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక దశలో 420 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 38వేల కీలక మద్దతు స్థాయి దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 122 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టంలోనే 37,971 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 138 పాయింట్ల నష్టంలో 11,450 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకుల సూచీ రెండు శాతం దాకా నష్టపోగా, ఫార్మా, రియాల్టి, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఒక శాతంపైగా నష్టపోయాయి. ముఖ్యంగా రూపీ అత్యంత కనిష్టానికి చేరడంతో మిడ్ సెషన్‌కి మార్కెట్లు 1 శాతం మేర నష్టాల్లోకి చేరుకున్నాయి. గత ముగింపుతో పోల్చితే డాలరుతో దేశీయ కరెన్సీ రూపాయి ఏకంగా 91 పైసలు క్షీణతను నమోదుచేసి 73 స్థాయి పతనానికి చేరువలో ఉంది. సన్ ఫార్మా, రెడ్డీ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు టాప్ లూజర్స్‌గా ఉండగా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, విప్రో, ఇన్ఫోసిస్, లుపిన్, యాక్సిస్ బ్యాంక్‌లు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. -
పండుగ సీజన్ : స్మార్ట్‌ఫోన్ ధరలపై నిరాశ
న్యూఢిల్లీ : పండుగ సీజన్లో కస్టమర్లకు నిరాశ కలిగించే విషయం. టర్కీ సంక్షోభం రూపాయి విలువను భారీగా దెబ్బకొట్టగా.. ఇప్పుడు ఆ రూపాయి స్మార్ట్‌ఫోన్ ధరలపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయిల్లోకి క్రాష్ అవడంతో, స్మార్ట్‌ఫోన్ కాంపోనెంట్ల ఇన్పుట్ వ్యయాలు 4 శాతం నుంచి 6 శాతం పెరుగుతున్నాయి. దీంతో హ్యాండ్సెట్ తయారీదారులు మొబైల్ ఫోన్ల ధరలను సెప్టెంబర్ మధ్య నుంచి పెంచనున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పడిపోయిన సంగతి తెలిసిందే. క్షీణించిన రూపాయి విలువ వద్ద కొత్త కాంట్రాక్ట్‌ల కోసం సంతకం చేసిన విక్రేతలు అత్యధిక మొత్తంలో నగదును కోల్పోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ధరల పెంపును చేపడతారని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. చైనీస్ ఆర్ఎన్బీతో కూడా రూపాయి విలువ 5.4 శాతం క్షీణించింది. ఇది కూడా స్మార్ట్‌ఫోన్ ధరలపై ప్రభావం చూపుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషకులు చెప్పారు. కొన్ని బ్రాండ్లు మాత్రమే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను భారత్‌లో తయారీ చేస్తున్నాయి. కానీ చాలా బ్రాండ్లు బయట మార్కెట్ల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఎక్కువగా చైనా నుంచి వస్తున్నాయి. దీంతో రూపాయి క్షీణత వాటిపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ 70కి పడిపోవడం స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఇండస్ట్రి ఇక ధరల పెంపును చేపట్టాల్సి ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహింద్రో అభిప్రాయపడ్డారు. అయితే డాలర్ విలువను ఎప్పడికప్పుడు పరిశీలిస్తున్నామని, ప్రస్తుతమైతే ఎలాంటి ధరల పెంపు ప్రణాళికను లేదని షావోమి తెలిపింది. ఒకవేళ రూపాయి 70 వద్దనే ఉంటే, ఫెస్టివల్ సమయంలో కొత్త ఉత్పత్తులపై ధరల పెంపును చేపడతామని పేర్కొంది. దిగ్గజ కంపెనీలు శాంసంగ్, ఒప్పో, వివో, లావా, కార్బన్, హెచ్ఎండీ, ఇంటెక్స్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు మాత్రం స్మార్ట్‌ఫోన్ ధరల పెంపుపై ఇంకా స్పందించలేదు. ఆగస్టు నుంచి అక్టోబర్ కాలం స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఎంతో ముఖ్యమైందని. అన్ని పండుగల సీజన్ అప్పుడే. మరి ఈసారి పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. -
రూపాయి పతనంపై రాహుల్ ట్వీట్, వైరల్
న్యూఢిల్లీ : దేశీయ కరెన్సీ రూపాయి అమ్మ.. బాబోయ్ అనిపిస్తోంది. చరిత్రలో తొలిసారి అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పతనమైంది. డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ తొలిసారి రూ.70ను తాకింది. ఓ వైపు పొంచుకొస్తున్న టర్కీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు.. మరోవైపు డాలర్ బలపడుతుండటం రూపాయి విలువను మరింత దిగజారుస్తున్నాయి. రూపాయి విలువ భారీగా చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను తాకిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూపాయి విలువ పతనంపై ట్విటర్లో ఓ వీడియోను షేర్చేశారు. రూపాయి తమ అధినేతపై విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానిస్తూ... రాహుల్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. రూపాయి పతనాన్ని ప్రస్తావిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై మోదీ చేసిన విమర్శల వీడియో ఇది. ‘ఈ వీడియోలో ఆర్థిక వ్యవస్థపై సుప్రీం లీడర్ ఇచ్చిన మాస్టర్ క్లాస్‌ను వినవచ్చు. ఎందుకు రూపాయి పడిపోతుందో ఆయన వివరించారు’ అని రాహుల్ పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ, ఆర్థిక పరిణామాల కారణాలతోనే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ అవినీతి పాలనతోనూ రూపాయి విలువ పతనమవుతుందంటూ అప్పట్లో మోదీ విమర్శించారు. తాజాగా రూపాయి భారీగా పతనమవడంతో, ఆ వీడియోను షేర్ చేస్తూ.. రాహుల్ ఈ ట్వీట్ చేశారు. 70 ఏళ్లలో మనం చేయలేనిది ఎట్టకేలకు మోదీ చేసి చూపించారని కాంగ్రెస్ నేతలు వెటకారంగా విమర్శిస్తున్నారు. The Indian #Rupee just gave the Supreme Leader, a vote of NO confidence, crashing to a historic low. Listen to the Supreme Leader's master class on economics in this video, where he explains why the Rupee is tanking. pic.twitter.com/E8O5u9kb23 — Rahul Gandhi (@RahulGandhi) August 14, 2018 రూపాయి పతనంపై రాహుల్ షేర్ చేసిన ఈ వీడియో బీజేపీ నాయకులను ఇరకాటంలో పడేసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు టర్కీ ఆర్థిక వ్యవస్థ మాంద్యమంలోకి వెళ్తుందనే సంకేతాల నేపథ్యంలో ప్రపంచ కరెన్సీలు కుప్పకూలుతున్నాయి. ఆ దేశ కరెన్సీ లీరా ఇప్పటికే పాతాళానికి జారిపోయింది. టర్కీ ఆర్థిక సంక్షోభం ఇటు యూరోపియన్ యూనియన్ను తాకుతోంది. దీంతో అక్కడి స్టాక్ మార్కెట్లనూ లీరా వెంటాడుతోంది. మొత్తం మీద టర్కీలో తలెత్తిన ఈ కరెన్సీ ముసలం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. -
రూపాయి పతనం ‘ఏల్నాటి శని’
పెద్ద నోట్ల రద్దు వంటి అనుమానాస్పద చర్యల ఫలితంగా భారత రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి రిజర్వ్ బ్యాంక్ రూపాయి పతనాన్ని నిలవరించడానికి రంగంలోకి దిగక తప్పని స్థితి దాపురించింది. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. దాని ఫలితాల్లో రూపాయి పతనం ఒక భాగం. అసలు రిజర్వు బ్యాంకునే ‘వాజమ్మ’గా మార్చేశారు. చివరికి ప్రజలెన్నుకున్న పార్లమెంటు, పార్లమెంటరీ కమిటీల ముందుకు రావడానికిగాని, చర్చలో పాల్గొనడానికిగాని బ్యాంకు అధిపతులు రాలేకపోయారు. నోట్ల రద్దు వ్యవహారం వారిని కుంగదీసింది. ‘‘ఆర్థిక మంత్రుల ఆదుర్దా అంతా ఎప్పటి కప్పుడు రాబడి పేరిట కొత్త మార్గాల అన్వేషణగా ఉండకూడదు. వారి ఆబ అంతా ఉత్పత్తినీ, ప్రజల క్షేమ సౌభాగ్యాలు పెంచే నూతన పద్ధతులను అనుసరించడంలో మాత్రమే ఉండాలి. ప్రజా సంక్షేమం భద్రంగా ఉండి, వారికి భరోసా ఏర్పడిననాడు ప్రభుత్వాలకు రాబడి కొరతే ఉండదు.’’ – 1871లో రాసిన ‘ఊడ్చుకుపోతున్న దేశ సంపద (డ్రెయిన్ థియరీ) అనే సుప్రసిద్ధ ఆర్థికపత్రంలో జాతీయవాది, ఆర్థికవేత్త దాదాభాయ్ నౌరోజీ ఉవాచ ‘‘అమెరికా తన డాలర్‌ని కాపాడుకునే క్రమంలో వర్థమాన దేశాల మార్కెట్ కరెన్సీలను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిలో మన రూపాయి విలువ దిగజారకుండా కాపాడడం భారత రిజర్వ్ బ్యాంక్ బాధ్యత.’’ – 2018 జూన్ 28న పలువురు భారత ఆర్థికవేత్తలు కాంగ్రెస్ ఏడు దశాబ్దాల పాలనలో ప్రారంభమై నేడు బీజేపీ పాలనలో(వాజ్‌పేయి–నరేంద్రమోదీ) కొనసాగుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిపాలనా విలువలు, ప్రకటిత రిపబ్లిక్ రాజ్యాంగ విలువలు వేగంగా పతనమౌతున్నాయి. ఈ దశలో అదే దామా షాలో దేశీయ రూపాయి విలువ, మారకం విలువ పదే పదే పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో వాజ్‌పేయి హయాంలోలాగే నేటి మోదీ పాలనలో కూడా బీజేపీ వాలిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోందని కితాబులిచ్చు కుంటోంది. మార్కెట్లో సామాన్య ప్రజలు కొను గోలు చేసే సరకుల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతు న్నాయి. మధ్యతరగతి ఉద్యోగవర్గాలు, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వృత్తిదారులు విలువ కోల్పోతున్న రూపాయినే ‘పుల్ల వెలుగే పూట బత్తెం’గా భావించి జీవితాలు గడుపుతున్నారు. ఒక వైపున పతన మౌతున్న రూపాయి విలువతో పోల్చితే ఇతర దేశాల కరెన్సీ బరువు పెరుగుతోంది. ముఖ్యంగా వర్థమాన దేశాలను అమెరికా డాలర్ వ్యవస్థ పరాధార స్థితిలోకి నెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో సర్వత్రా విలువలేని నోట్లు దేశంలో మార్కెట్‌ను ముమ్మరించే దశ వచ్చింది. మార్కెట్లోకి విలువలేని నోట్లు ముమ్మరించడ మంటే అర్థం– నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలు, ప్రయాణ ఖర్చులు, వైద్యం, ఆరోగ్య ఖర్చులు తడిసి మోపెడు కావడమే. మళ్లీ వర్ధమాన దేశాలను పీడిస్తున్న అమెరికా! 2007–2008లో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయక స్థానంలో ఉన్న అమెరికన్ డాలర్, ఇతర దేశాల దోపిడీపై ఆధారపడిన దాని విలువ తర్వాత తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అయితే, ఈ పరిస్థితిని వర్థమాన దేశాలపై రుద్దడానికి ప్రయత్నించింది. దాని ఫలితమే నేటి సర్వవ్యాపిత సంక్షోభం. అమె రికా కొత్తగా తన కరెన్సీ రక్షణ పేరిట వేసిన ఎత్తుగడ ‘వాణిజ్య యుద్ధాలు’. వాణిజ్య యుద్ధాలను మొదట అమెరికా ఎదురుదాడిగా ప్రారంభించింది. ఇప్పటికీ ఈ ట్రేడ్ వార్‌ను తట్టుకుని నిలబడగలిగిన స్తోమత ఉన్న దేశం చైనా ఒక్కటే! ఇండియాకు అంత శక్తి లేదు. విలువ కోల్పోతున్న రూపాయి మారకంలో మనం విదేశాలకు చేయాల్సిన సరకుల ఎగుమతుల విలువ తరిగి–మనం దిగుమతి చేసుకునే వస్తువుల రేటు పెరిగిపోతోంది. అంటే ఇరు వైపులా ‘క్షవరం’ అయ్యేది భారతదేశమే అని మరచిపోరాదు. అమెరికాను రేపో మాపో చైనా అధిగమించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానానికి చేరు కుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఆ పరిణామాన్ని నిలువరించడం కోసమే అమెరికా అధ్యక్షుడు కజ్జా కోరు డొనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధాలు ప్రకటిం చారని మరచిపోరాదు. అమెరికా సరకులపై చైనా సుంకాలు తగ్గించకపోతే, చైనా సరకులపై భారీగా సుంకాలు విధిస్తానన్న బెదిరింపులకు ట్రంప్ దిగారు. ఇంకా చైనా స్థాయికి ఎదగని ఇండియాను, మన పాలకులను అదే స్థాయిలో ఒత్తిడి చేస్తూ, అమెరికా సరకులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్ హెచ్చరిస్తు న్నారు. అక్కడికీ సరేనని, మోదీ ప్రభుత్వం మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 25 వస్తువుల పైన సుంకాలు తగ్గిస్తానని ప్రతిపాదించింది. కానీ, నిజానికి ఇప్పటి దాకా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ విషయంలో దేశ ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరించలేదు. మన దేశ పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సుఖంగా ఉత్పత్తి చేసుకోగల దాదాపు రెండు వేలకు పై చిలుకు వస్తువులను అమె రికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్న ఓ సత్యాన్ని మరచిపోకూడదు. పైగా, అమెరికా ఒత్తిళ్లకు లొంగి ఆ సరకులపై సుంకాలను లోగడనే తగ్గించ డమో, రద్దుచేయడమో జరిగిందన్న సత్యాన్ని కూడా మర్చిపోరాదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అమెరికా నుంచి చేసుకునే పాతిక దిగుమతులపై ‘రాయితీ’ ఇస్తానని ప్రకటించుకోవడం మన కరెన్సీ విలువను శాసిస్తున్న డాలర్‌కు లొంగిపోవడమే. సవాలు స్వీకరించిన చైనా ఎదురుదాడి! అమెరికా మార్కెట్‌ను ఇన్నాళ్లుగా చైనా ఎగుమతులే శాసిస్తున్నాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం సవాలును చైనా స్వీకరించింది. తానూ కయ్యానికి సిద్ధమని ఎదురు సవాలు విసిరింది. అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచేసింది. అమెరికా మార్కెట్‌ను ముంచెత్తే చైనాను అమెరికా మార్కెట్ నుంచి సాగ నంపడం సాధ్యపడని విషయం కాబట్టే ట్రంప్ ఒక మేరకు దిగిరాక తప్పలేదు. ఇక ఇండియా విషయా నికి వస్తే–మనం పలు రకాల అమెరికా దిగుమతు లపై ఆధారపడి ఉన్నాం. మొత్తం ఆర్థికవ్యవస్థను బహుళజాతి కంపెనీ పెట్టుబడుల పట్టు నుంచి, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ దశ నుంచి తప్పిం చగలిగితేనే అమెరికా ఒత్తిళ్లను తట్టుకోగలం. పాలకులు ప్రజలకు చూపే సగటు జాతీయో త్పత్తుల విలువకు, చూపెడుతున్న ఆర్థికాభివృద్ధి వాస్తవ లెక్కలకు చాలా తేడా ఉంటోందని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ వెల్లడించారు. అలాగే వర్తమాన ఆర్థిక సంవత్సరాల్లో పాలకులు చూపే ఆర్థిక లోటు అంచనాలకు, వాస్తవంలో అంచ నాకు అందే లోటుకూ తేడా ఉందని తెలిపారు. ఎందుకంటే, జాతీయోత్పత్తుల విలువ 2017–18 తొలి మూడు మాసాలలో అంతకు ముందు ఏడా దిలో లోటు బడ్జెట్లో 0.6 శాతం నమోదు కాగా, ఆ లోటు చివరి మూడు మాసాల్లో 1.9 శాతానికి పెరిగి, 2019లో 2.5 శాతానికి పెరగనుంది. ఈ లెక్కన రూపాయి విలువను దిగజార్చి పెరిగిన డాలర్ 2019 ఆర్థిక సంవత్సరంలో ఇతర ప్రధాన పోటీ కరెన్సీ విలువలకు కనీసం 7.5 శాతం దాకా (ఫిబ్రవరికి) పెరిగిపోవచ్చని అంచనా. చివరికి రూపాయి విలు వలో అనిశ్చిత పరిస్థితి ఫలితంగా, 2018 ఏప్రిల్‌లో విదేశీ పెట్టుబడులు (పోర్ట్‌ఫోలియో) రూ. 15,561 కోట్లు అర్థంతరంగా దేశం నుంచి ‘ఉడాయించాయి’ . ఒక్క మే నెలలోనే రూ. 29,714 కోట్లు బయటకుపో యాయి. రూపాయి విలువ కుదేలయ్యాక భారత్ బాండ్స్ మార్కెట్ నుంచి ఈ విదేశీ నిధులు ఆక స్మికంగా తరలిపోయాయి. అంటే ఇండియన్ బాండ్స్ విలువ ఆ మేరకు పతనమైపోయింది. నోట్ల రద్దుతో రిజర్వ్ బ్యాంక్‌కు మరకలు పెద్ద నోట్ల రద్దు వంటి అనుమానాస్పద చర్యల ఫలితంగా భారత రాజకీయ చరిత్రలో మొట్టమొదటి సారి రిజర్వ్ బ్యాంక్ రూపాయి పతనాన్ని నిల వరిం చడానికి రంగంలోకి దిగక తప్పని స్థితి దాపురిం చింది. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని విచ్చలవి డిగా దుర్వినియోగం చేశారు. దాని ఫలితాల్లో రూపాయి పతనం ఒక భాగం. పాలకులు హామీ పడిన జనధన్ అకౌంట్లు ప్రాణం పోసుకోవడం మానేశాయి, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 24 లక్షల కోట్ల మేర భారత సంపన్నుల దొంగ డబ్బును వెతికితెచ్చి, పేద వర్గాలకు కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పంచుతామన్న పాలకుల ప్రగల్భాలూ ‘గుంటపూలు’ పూశాయి. పైగా స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనానికి 2017లోనే అదనంగా రూ.7 వేల కోట్లు వచ్చి చేరడం బీజేపీ పాలకులకు పెను సవాలుగా మారింది. కేంద్ర ప్రభుత్వం పరువు మరింతగా బజారున పడిపోయింది. అసలు రిజర్వు బ్యాంకునే ‘వాజమ్మ’గా మార్చే శారు. చివరికి ప్రజలెన్నుకున్న పార్లమెంటు, పార్ల మెంటరీ కమిటీల ముందుకు రావడానికిగాని, చర్చలో పాల్గొనడానికిగాని బ్యాంకు అధిపతులు రాలేకపోయారు. నోట్ల రద్దు వ్యవహారం వారిని కుంగదీసింది. ‘‘మన దేశ జాతీయోత్పత్తుల విలు వను లెక్క కట్టడానికేగాక, ఆ విలువకు తగిన ఆర్థిక స్తోమతను కల్పించడంలో, విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడుల ఈక్విటీని పెద్ద ఎత్తున సమకూర్చడంలో విదేశీ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ కంపెనీలు సమకూర్చిన విదేశీ నిధులనే విదేశీ మారక ద్రవ్య నిల్వలని చెప్పుకోడానికి ఇండియా వెరవటం లేదు,’’ అని ‘థామస్ రాయిటర్స్’ సంస్థ (2018) నివేదిక వెల్లడించింది. ఎందుకీ దుస్థితి? కేంద్ర ప్రభుత్వ పోకడలు, రిజర్వ్ బ్యాంక్ విధానాలు మనల్ని ‘ఏల్నాటి శని’గా పీడిస్తున్నాయి. అందుకు దీటైన సమాధానం కోసం వెతకాలి. అర్థం లేని సాకులను పక్కనపెట్టి గాలి కబుర్లతో తిరుగుతున్న మనమూ, పాలకులూ భారత రాజ్యాంగ నిర్దేశాన్ని ఒక్కసారి మననం చేసుకోవాలి: ‘దేశ పౌరులకు తగినంత జీవన భృతిని పొందే హక్కు కల్పించేందుకు వీలుగా అనువైన సాంఘిక వ్యవస్థను నెలకొల్పి రక్షించాలి. తద్వారా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించాలి. అలాంటి వ్యవస్థ జాతీయ జీవనంలోని అన్ని వ్యవస్థలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగేలా వ్యవ హరించాలి’. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఆర్మీ దాడి : రూపాయి క్రాష్
గత వారం రోజులుగా బలపడుతూ వస్తున్న రూపాయి ఒక్కసారిగా కుప్పకూలింది. నియంత్రణ రేఖ వెంబడి మోహరించి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్( డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరవల్ రణబీర్ సింగ్ వెల్లడించడంతో, రూపాయి 46 పైసలు మేర పతనమైంది. దీంతో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి 66.91గా నమోదైంది. బ్రెగ్జిట్ అనంతరం ఇదే అతిపెద్ద ఇన్ట్రా-డే పతనం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రూపాయి ఈ స్థాయిలోనే పడిపోయింది. 66.65 స్థాయే రూపాయికి అత్యంత కీలకమైన సపోర్టని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిమాణాలు తదుపరి రేట్ల కోత ఆశకు విఘాతం కలిగిస్తున్నాయని అంటున్నారు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఆర్బీఐ పాలసీపై కూడా ప్రభావం చూపనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు డీజీఎంఓ వ్యాఖ్యల అనంతరం మార్కెట్లు సైతం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 573 పాయింట్లు నష్టపోయింది.