పేపర్‌ లీక్స్‌ను అడ్డుకోవడంలో ప్రధాని విఫలం: రాహుల్‌ | Rahul Gandhi fires on Prime Minister Modi | Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్స్‌ను అడ్డుకోవడంలో ప్రధాని విఫలం: రాహుల్‌

Published Thu, Jun 20 2024 3:34 PM | Last Updated on Thu, Jun 20 2024 4:24 PM

Rahul Gandhi fires on Prime Minister Modi

సాక్షి, న్యూఢిల్లీ: పేపర్‌ లీక్స్‌ను ప్రధాని మోదీ అడ్డుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశార్థకంగా మారిందన్నారు. అన్ని వ్యవస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని.. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

నీట్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్స్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు? రాహుల్‌  అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని రాహుల్‌ అన్నారు.

యూనివర్సిటీలో బీజేపీ వారిని నియమించడం వల్లే పేపర్ లీకులు.. సామర్థ్యం లేని వారినివైస్ ఛాన్స్‌లర్లగా నియమిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీలలో పేపర్ లీక్ అయ్యింది. విద్యావ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. పేపర్ లీక్ అంశం పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహణలో విఫలమైంది. పేపర్ లీక్ చేసినవారిని కఠినంగా శిక్షించాలి’’ అని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

కాగా, దేశవ్యాప్తంగా ‘నీట్‌’ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నీట్‌ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు, నీట్‌ అభ్యర్థులతో ఇవాళ సాయంత్రం రాహుల్‌ గాంధీ సమావేశం కానున్నారు.

పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీ


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement