ఎయిర్‌టెల్ 4జీ ఫోన్ ధర, ఫీచర్లు లీక్!
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోకు పోటీగా దేశీ ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ అందుబాటులోకి తేనున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జియో తన 4 జీ ఫీచర్ ఫోన్‌ను దసరాకి బరిలోకి దింపుతుండగా,ఎయిర్‌టెల్ దీపావళి నాటికి మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ముఖ్యంగా జియో 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కూడా బడ్జెట్ ధరలో4జీఫోన్‌ను ప‍్రకటించింది. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌గా విడుదల చేయాలని భావిస్తోందట. తాజా అంచనాల ప్రకారం రూ. 2,500-2,700 మధ్యలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు వేగవంతం చేసింది. దీపావళికి దీనికి కస్టమర్లకు అందించాలని బావిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఎయిర్‌టెల్ సిమ్‌ను ఉచితం. దీంతోపాటు ఆకర్షణీయైన డేటా ఆఫర్లను కూడా ప్రవేశపెట్టనుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే ..
డ్యుయల్ సిమ్
4 అంగుళాల డిస్‌ప్లే
1 జీబీ ర్యామ్
డబుల్ కెమెరాలు
4జీ వోల్ట్ కాలింగ్ సదుపాయం
భారీ బ్యాటరీ
ఇవి ప్రధాన ఫీచర్లుగా అందించనుందని విశ్వనీయ వర్గాలు సమాచారం. అయితే ఎప్పటినుంచి బుకింగ్‌లను ప్రారంభించనుందనే విషయాలను ఇంకా వెల్లడించలేదు.
కాగా ఆగస్టు 24నుంచి జియో ఫోన్ కోసం అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన రిలయన్స్ జియో దీన్ని దసరాకు (సెప్టెంబర్‌లో) కస్టమర్లకు పలకరించనుంది. అన్‌లిమిటెడ్‌కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లతో అందిస్తున్న జియో ఫోన్ కోసం 60లక్షల (ఆరు మిలియన్ల) బుకింగ్లులు నమోదైన సంగతి తెలిసిందే.