ప్రధానిగా ఓలి రెండేళ్లు.. దేవ్‌బా ఒకటిన్నరేళ్లు | Nepal New Coalition Government Explained | Sakshi
Sakshi News home page

ప్రధానిగా ఓలి రెండేళ్లు.. దేవ్‌బా ఒకటిన్నరేళ్లు

Published Mon, Jul 22 2024 6:17 AM | Last Updated on Mon, Jul 22 2024 6:17 AM

Nepal New Coalition Government Explained

నేపాల్‌ సంకీర్ణంలోని ప్రధాన పార్టీల మధ్య ఒప్పందం

కఠ్మాండు: నేపాల్‌లో కొత్తగా ప్రధాని కేపీ శర్మ ఓలి సారథ్యంలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన పార్టీల మధ్య అధికార పంపిణీ ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం కేపీ శర్మ ఓలి ప్రధానిగా రెండేళ్లు కొనసాగుతారు, ఆ తర్వాత మిగతా ఏడాదిన్నర కాలంలో నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ) చీఫ్‌ షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ప్రధానిగా పగ్గాలు చేపడతారు. 

ఈ మేరకు తమ మధ్య కీలకమైన ఏడు అంశాలపై అంగీకారం కుదిరినట్లు నేపాల్‌– యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌–లెనినిస్ట్‌(సీపీఎన్‌–యూఎంఎల్‌) చీఫ్, ప్రధాని ఓలి ఆదివారం పార్లమెంట్‌లో వెల్లడించారు. దీంతో, సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామ్యపక్షాలైన ఎన్‌సీ, సీపీఎన్‌–యూఎంఎల్‌ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందంపై వస్తున్న అనేక ఊహాగానాలకు ఆయన చెక్‌ పెట్టినట్లయింది. పార్లమెంట్‌లో బల నిరూపణలో విఫలమైన ప్రచండ స్థానంలో గత వారం ఓలి ప్రధానిగా ప్రమాణం చేయడం తెల్సిందే. దీంతో, ఆదివారం ఓలి పార్లమెంట్‌ దిగువ సభలో ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు పడ్డాయి. దీంతో, ఓలి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని పొందినట్లు స్పీకర్‌ దేవ్‌ రాజ్‌ ఘిమిరే ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement