ఓలీ ప్రధానిగా పనికిరాడు | pm oli lost moral and political ground to rule says nepali congress | Sakshi
Sakshi News home page

ఓలీ ప్రధానిగా పనికిరాడు

Published Thu, Jul 16 2020 1:30 PM | Last Updated on Thu, Jul 16 2020 1:47 PM

pm oli lost moral and political ground to rule says nepali congress - Sakshi

కఠ్మాండు, నేపాల్​: శ్రీరాముడు నేపాల్​కు చెందినవాడేనంటూ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన వివాదాస్పద కామెంట్లను నేపాలీ కాంగ్రెస్​ ఖండించింది. నీతినియమాలను, రాజకీయ స్థిరత్వాన్ని కోల్పోయిన ఆయన దేశానికి ప్రధానిగా పనికిరాడంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అయోధ్య నేపాల్​లోని బిర్గంజ్​లో ఉందని, శ్రీరాముడి జన్మస్థలం నేపాలేనని ఓలి చేసిన కామెంట్లపై అధికార కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కోరింది. (కరోనా వ్యాక్సిన్‌పై ‘ఆక్స్‌ఫర్డ్’‌ ముందడుగు!)

‘ప్రధాని పని తీరు అసలు బాలేదు. ఆయన మాటలు ఒకలా, చేతలు మరోలా ఉంటున్నాయి. ఆయన్ను ప్రధానిగా కొనసాగించడంపై కమ్యూనిస్టు పార్టీ పునరాలోచించుకోవాలి లేదా ఆయన్ను తీరు మార్చుకోమని సూచించాలి’ అని నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బిశ్వో ప్రకాశ్ శర్మ పేర్కొన్నారు. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement