నేపాల్లో రాజకీయ సంక్షోభం: ప్రధాని రాజీనామా | Nepali PM KP Sharma Oli lose no-confidence vote, resings | Sakshi
Sakshi News home page

నేపాల్లో రాజకీయ సంక్షోభం: ప్రధాని రాజీనామా

Published Sun, Jul 24 2016 7:28 PM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM

నేపాల్లో రాజకీయ సంక్షోభం: ప్రధాని రాజీనామా - Sakshi

నేపాల్లో రాజకీయ సంక్షోభం: ప్రధాని రాజీనామా

కఠ్మాండు: హిమాలయ దేశం నేపాల్ లో రాజకీయ సంక్షభం తలెత్తింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరకముందే ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం సాయంత్రం పదవికి రాజీనామా చేశారు. ఓలీ నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్) ప్రభుత్వంలో భాగస్వాములైన మావోయిస్టు పార్టీ రెండు వారాల కిందటే మద్దతు ఉపసంహరించుకోగా, రాష్ట్రీయ ప్రజాతంత్ర, మాదేసి జనాధికార ఫోరంతోపాటు మరో రెండు చిన్నపార్టీలు సైతం పక్కకు తప్పుకున్నాయి. దీంతో మైనారిటీలో పడ్డ ఓలీ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొవాల్సి వచ్చింది.

అవిశ్వాస తీర్మానానినికి ప్రతిపక్ష నేపాల్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే మద్దతు తెలిపింది. అలా అన్ని పార్టీలు ఏకమై ప్రధానిపై తిరుగుబావుటా ఎగరేశాయి. ఎలాగూ ఓటమి తప్పని పరిస్థితుల్లో ఓలీ రాజీనామా చేశారు. అయితే పార్టీల మధ్య నెలకొన్న సైద్ధాంతిక, రాజకీయ విబేధాల మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? అన్నది సంశయమే! పార్లమెంట్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు వినవస్తున్నాయి.

ఎందుకీ అనిశ్చితి?
601 సభ్యుల లెజిస్లేచర్ పార్లమెంట్ ఆఫ్ నేపాల్ (నేపాల్ పార్లమెంట్) లో ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మాక్సిస్ట్, లెనినిస్ట్)కు 175 మంది సభ్యులున్నారు. అధికారం చేపట్టడానికి కావాల్సిన కనీస బలం 299. దీంతో సీపీఎన్.. మావోయిస్టు పార్టీ(80 మంది సభ్యులు), ఆర్పీపీ(24), మాదేసిల ఫోరం (14 మంది సభ్యుల) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కేపీ శర్మ ఓలి ప్రధానిగా ఎన్నికయ్యారు. 196 మంది సభ్యులున్న నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఓలి తుంగలోతొక్కారని మద్దతు ఉపసంహరించుకున్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. 'ఆయన తనగురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు. అహంకారి. మనుగడ కోసం మా పార్టీని వాడుకుని లబ్దిపొందాలనుకుంటున్నాడు' అంటూ మావోయిస్టు పార్టీ నేత ప్రచండ.. ప్రధాని ఓలీపై నిప్పులు చెరిగారు.

ఓలీ మోనార్కిజం!
'నేపాల్ ను సమాఖ్య రాజ్యం(ఫెడరల్ స్టేట్) గా తీర్చిదిద్దాలనుకుంటున్న నాపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు' అని ప్రధాని ఓలీ శర్మ శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఆవేదన చెందారు. నూతన రాజ్యాంగం అమలులోకి తెచ్చిన సమయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ మాదేసీలు చేసిన ఉద్యమాన్ని ప్రధాని ఓలి తీవ్రంగా అణిచివేశారు. నాటి ఆందోళనల్లో 50 మంది మాదేసీలను పోలీసులు కాల్చిచంపారు. భారత్ తో సత్సంబంధాలను తెంచుకుని చైనాకు దగ్గరవుదామనుకున్న ఓలీని స్వపక్షం వారే వ్యతిరేకించారు. కానీ ఆయన 'ఏకపక్షంగా' చైనా అంటకాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement