ఖాట్మండూ: భారత్‌కు చెందిన మూడు వ్యూహాత్మక భూభాగాలను నేపాల్‌లో కలిపిస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన తర్వాత తనను పదవి నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలీ ఆరోపించారు. అయితే, తనను గద్దె దించడం అసాధ్యమని ఆదివారం తేల్చిచెప్పారు. ఖాట్మాండూలోని ఓ హోటల్‌లో తనపై కుట్రలకు కార్యాచరణ జరుగుతోందని, ఇందులో ఓ దేశ రాయబార కార్యాలయం చురుగ్గా పాల్గొంటోందని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. భారత భూభాగాలైన లిపూలేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను నేపాల్‌కు చెందినవంటూ మ్యాప్ రూపొందించి.. దానిపై రాజ్యాంగ సవరణ చేసిన ఓలీ.. ఈ మ్యాప్ రూపకల్పన వల్లే భారత్ తన ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని ఆస్థిరపర్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.(చదవండి : చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ)
Comments
Please login to add a commentAdd a comment