encroached land
-
ఉద్రిక్తత నడుమ బుగ్గమఠం భూముల సర్వే
తిరుపతి మంగళం: తిరుపతిలోని బుగ్గమఠం భూముల సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. భూముల హక్కుదారులు సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసు బందోబస్తు నడుమ అధికారులు సర్వే ముగించారు. తిరుపతి మారుతీనగర్‌లోని బుగ్గమఠం భూములలో శనివారం తప్పుడు నోటీసులతో దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ సర్వే అధికారులు పోలీసు బలగాలతో సర్వే చేసేందుకు సిద్ధపడ్డారు. వందేళ్లుగా పట్టం వెంకట్రాయులు ఆ«దీనంలో ఉన్న బుగ్గమఠం భూములకు సంబంధించి 35 ఏళ్ల క్రితమే భూముల క్రయ విక్రయాలు జరుపుకొనేందుకు కోర్టు అనుమతి కూడా ఇచ్చిందని వెంకట్రాయులు కుమారులు, మనవళ్లతోపాటు ఇతర హక్కుదారులు డేగల మునికుమార్, ఎన్.యశోదమ్మ, పురంధర్, డేగల మునిరాజమ్మ, పట్టెం మునిప్రభాకర్ తెలిపారు.తిరుపతి మంగళం: తిరుపతిలోని బుగ్గమఠం భూముల సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. భూముల హక్కుదారులు సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసు బందోబస్తు నడుమ అధికారులు సర్వే ముగించారు. తిరుపతి మారుతీనగర్‌లోని బుగ్గమఠం భూములలో శనివారం తప్పుడు నోటీసులతో దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ సర్వే అధికారులు పోలీసు బలగాలతో సర్వే చేసేందుకు సిద్ధపడ్డారు. వందేళ్లుగా పట్టం వెంకట్రాయులు ఆ«దీనంలో ఉన్న బుగ్గమఠం భూములకు సంబంధించి 35 ఏళ్ల క్రితమే భూముల క్రయ విక్రయాలు జరుపుకొనేందుకు కోర్టు అనుమతి కూడా ఇచ్చిందని వెంకట్రాయులు కుమారులు, మనవళ్లతోపాటు ఇతర హక్కుదారులు డేగల మునికుమార్, ఎన్.యశోదమ్మ, పురంధర్, డేగల మునిరాజమ్మ, పట్టెం మునిప్రభాకర్ తెలిపారు.ఇప్పుడు అకస్మాత్తుగా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని భూ హక్కుదారులు అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ సర్వే నిర్వహించాలన్నా ఆ భూములకు సంబంధించిన 9 మంది హక్కుదారులకు ముందస్తు నోటీసులు జారీ చేశాక సర్వే నిర్వహించాలి కదా... అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి హఠాత్తుగా వచ్చి ఒకరు, ఇద్దరికి నోటీసులు ఇవ్వడం ఏమిటని, అందులో ఈ నెల 3వ తేదీన సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొని ఆ నోటీసును గత నెల 24న ఇచి్చనట్లుగా చెప్పడం చూస్తే.. వారు తప్పుడు నోటీసులు ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు.న్యాయబద్ధంగా సర్వే నిర్వహించాలనుకుంటే భూ హక్కుదారులందరికీ 10 రోజులముందే నోటీసులు జారీచేసి అందరి సమక్షంలో సర్వే చేయాలన్నారు. అలాకాకుండా అర్ధంతరంగా వచ్చి బుగ్గమఠం భూముల సర్వే చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి ఏకపక్షంగా సర్వే నిర్వహించారు. భూ హక్కుదారులను పక్కకు నెట్టేసి సర్వేకు అడ్డురావొద్దని హెచ్చరిస్తున్న డీఎస్పీ భక్తవత్సలంఇప్పుడు అకస్మాత్తుగా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని భూ హక్కుదారులు అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ సర్వే నిర్వహించాలన్నా ఆ భూములకు సంబంధించిన 9 మంది హక్కుదారులకు ముందస్తు నోటీసులు జారీ చేశాక సర్వే నిర్వహించాలి కదా... అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి హఠాత్తుగా వచ్చి ఒకరు, ఇద్దరికి నోటీసులు ఇవ్వడం ఏమిటని, అందులో ఈ నెల 3వ తేదీన సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొని ఆ నోటీసును గత నెల 24న ఇచి్చనట్లుగా చెప్పడం చూస్తే.. వారు తప్పుడు నోటీసులు ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు. న్యాయబద్ధంగా సర్వే నిర్వహించాలనుకుంటే భూ హక్కుదారులందరికీ 10 రోజులముందే నోటీసులు జారీచేసి అందరి సమక్షంలో సర్వే చేయాలన్నారు. అలాకాకుండా అర్ధంతరంగా వచ్చి బుగ్గమఠం భూముల సర్వే చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి దేవదాయ, బుగ్గమఠం, రెవెన్యూ అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి ఏకపక్షంగా సర్వే నిర్వహించారు. -
బొబ్బిలిలో భూ బకాసురులు
బొబ్బిలి రూరల్ : విజయనగరం జిల్లా బొబ్బిలిలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. గిరిజనులను బెదిరించి డీ–పట్టా భూములను కబళిస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించి సాగుభూములుగా మలుస్తున్నారు. ఎవరైనా ప్రశ్చిస్తే బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబీనాయన మనుషులమంటూ హడలెత్తిస్తున్నారు. అమాయక గిరిజనుల కళ్లుగప్పి భూమిని కాజేస్తున్నారు. బొబ్బిలి మండలంలోని మోసూరువలస, డొంగురువలస, కేశాయవలస, కొత్తవలస తదితర గిరిజన గ్రామాలకు వెళ్తే ఆక్రమణదారులు వెదురు కంచెలు నిర్మించి సాగుచేస్తున్న మామిడి, జీడి, టేకు వనాలు సాక్షాత్కరిస్తాయి. దురాక్రమణలు ఇలా.. గోపాలరాయుడుపేట, చిత్రకోటబోడ్డవలస, కాశిందొరవలస తదితర గ్రామ పంచాయతీల పరిధిలో వందల ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిని టీడీపీ నేతలు, అధికారుల అండతో బడాబాబులు పక్కా స్కెచ్‌తో ఆక్రమిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి కొన్ని కుటుంబాలను ముందుగా రప్పిస్తున్నారు. వారి నివాసం కోసం ఆక్రమించేందుకు సిద్ధమైన భూముల్లో చిన్నచిన్న గుడారాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి అటవీ భూముల్లో చెట్లను నరికి సాగుభూములుగా మారుస్తున్నారు. నెలలు గడిచాక పట్టాలివ్వాలంటూ వారితో ప్రభుత్వానికి దరఖాస్తు చేయిస్తున్నారు.అనంతరం.. అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి పేరున డీ–పట్టాలు ఇప్పిస్తున్నారు. ఎంత భూమి ఇస్తున్నారన్న విషయం కూడా ఆ వలస జీవులకు తెలీదు. పట్టాలు వచ్చిన వెంటనే వారితో కాగితాలపై సంతకాలు చేయించి ఇక్కడ పనిలేదంటూ మరో ప్రాంతానికి పంపిస్తున్నారు. ఇలా ఇప్పటికే సుమారు 500 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు బడాబాబుల హస్తగతమయ్యాయి. వీరి భూదాహంవల్ల తాతల కాలంలో ఉండే అడవులు, అటవీ జంతువులు కనుమరుగవుతున్నాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికార యంత్రాంగం సమగ్ర దర్యాప్తు చేస్తే భూముల ఆక్రమణ వ్యవహారం బయటపడుతుందన్నది గిరిజన సంఘాలు చెబుతున్నాయి.ఆక్రమణలు వెలుగులోకి ఇలా..సీహెచ్ బొడ్డువలస గ్రామపంచాయతీ కేశాయవలస గిరిజన గ్రామానికి ఆనుకుని ఉన్న ఆక్రమిత భూమిలో టేకు మొక్కలకు నీళ్లుపోసే వాటర్ ట్యాంకు ట్రాక్టర్‌ను నడుపుతున్న డ్రైవర్ పోలిరాజు గతనెల 28న ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, అధికారులు.. ఇంత పెద్దఎత్తున టేకు మొక్కలు సాగుచేస్తున్నది ఎవరని ఆరా తీయగా అక్కడివారు మొదట ఎమ్మెల్యే బేబినాయన అని, ఎమ్మెల్యే అనుచరులదని చెప్పుకొచ్చారు.విశాఖపట్నంలో నివసిస్తున్న ఎమ్మెల్యే అనుచరుడిదని గిరిజనులు తెలిపారు. టేకు మొక్కలు వేసిన దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో వెదురు ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. సోలార్ ప్యానెళ్లతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటూ అటవీ, డీ–పట్టా భూముల్లో తోటలు పెంచుతున్నారు. సారవంతమైన ఎర్రరేగడి నేల కావడంతో అమాయక గిరిజనులను భయపెట్టి సొంతం చేసుకున్నట్లు సమాచారం. మారుమూల గిరిజన గ్రామం కావడంతో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. అసలా భూములు ఎవరికి చెందినవో, ఏ పంచాయతీ పరిధిలోకి వస్తాయో కూడా రెవెన్యూ అధికారులకు తెలీకపోవడం విచిత్రం. ఆక్రమణల గురించి నాకేం తెలీదు.. గిరిజనుల డీ–పట్టా భూముల ఆక్రమణ వ్యవహారం నాకేమీ తెలీదు. ఫిర్యాదు వస్తే సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. – ఎం. శ్రీను, బొబ్బిలి తహసీల్దార్ తెలుసుకుని చెబుతా.. నేను ఇక్కడకు కొత్తగా వచ్చాను. కొండ భూములను ఇంత పెద్దస్థాయిలో ఎవరు సాగుచేస్తున్నారో తెలీదు. వివరాలు తెలుసుకుని అధికారులకు నివేదిక అందిస్తాను. – పోలినాయుడు, వీఆర్వో, సీహెచ్ బొడ్డవలస -
ఆలయ భూముల్లోని పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు: మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: కబ్జాల్లో ఉన్న దేవాలయ భూములను స్వా«దీనం చేసుకునే క్రమంలో ఆ భూ ముల ఆక్రమణలో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆలయాల భూములు స్వాధీనం చేసుకుని దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే 34,092 ఎకరాల ఆలయ భూముల జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ఆలయ భూముల హద్దులు నిర్ధారిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఎకో–టెంపుల్ టూరిజం.. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న అటవీ భూముల్లో సుందర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు మంత్రి సురేఖ తెలిపారు. అలాగే దీనిని ఇప్పుడు ఆధ్యాత్మికతకు జోడించి ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను అద్భుత పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. దేవాలయాల్లో ఫిర్యాదుల పుస్తకం.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసేందుకు పుస్తకాలను ఏర్పాటు చేస్తామని, వాటిల్లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వేములవాడ దేవాలయ గోపురానికి కూడా స్వర్ణ తాపడం చేయిస్తామని, ఇందుకు 65 కిలోల ఆలయ బంగారాన్ని వాడతామని ఆమె చెప్పారు. ఆలయంలోని వెండితో పల్లకీ చేయిస్తామన్నారు. అలాగే బాసర దేవాలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంతో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిని రక్షించడం కోసమే పెన్సింగ్:ఆర్డీవో
-
భారత్‌పై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు
ఖాట్మండూ: భారత్‌కు చెందిన మూడు వ్యూహాత్మక భూభాగాలను నేపాల్‌లో కలిపిస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన తర్వాత తనను పదవి నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలీ ఆరోపించారు. అయితే, తనను గద్దె దించడం అసాధ్యమని ఆదివారం తేల్చిచెప్పారు. ఖాట్మాండూలోని ఓ హోటల్లో తనపై కుట్రలకు కార్యాచరణ జరుగుతోందని, ఇందులో ఓ దేశ రాయబార కార్యాలయం చురుగ్గా పాల్గొంటోందని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. భారత భూభాగాలైన లిపూలేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను నేపాల్‌కు చెందినవంటూ మ్యాప్ రూపొందించి.. దానిపై రాజ్యాంగ సవరణ చేసిన ఓలీ.. ఈ మ్యాప్ రూపకల్పన వల్లే భారత్ తన ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని ఆస్థిరపర్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.(చదవండి : చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ) -
చైనా ఆక్రమణ: మౌనం వీడని నేపాల్!
ఖాట్మండూ: చైనా.. నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిందన్న వార్తలపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పార్టీ సభ్యులు దేవేంద్ర రాజ్ కండేల్, సత్య నారాయణ్ శర్మ ఖనాల్, సంజయ కుమార్ గౌతం పార్లమెంటు దిగువ సభలో బుధవారం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘నేపాల్ భూభాగంలోని డోలఖ, హమ్లా, సింధుపాల్‌చౌక్, సంఖువాసభ, గోర్ఖా, రసువా జిల్లాల్లో దాదాపు 64 హెక్టార్లను చైనా ఆక్రమించింది. చైనా టిబెట్ రీజియన్ సమీపంలో ఉత్తర గోర్ఖాలోని రూయీ గ్రామం సరిహద్దు వద్ద గల పిల్లర్ 35ని ముందుకు జరిపారు. తద్వారా రూయీలోని 72 కుటుంబాలు, దార్చౌలాలోని 18 ఇండ్లు చైనా భూభాగంలోకి వెళ్లిపోయాయి’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై చర్చ జరిపి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.(నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా!) కాగా నేపాల్, చైనాతో దాదాపు 141,488 చదరపు కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా చైనాతో మరింత స్నేహంగా మెలుగుతున్న నేపాల్‌కు డ్రాగన్ ఇటీవల గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని చైనా దురాక్రమణకు గురైందని.. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం నివేదిక వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి నేపాల్‌లోని 10 ప్రాంతాలను డ్రాగన్ ఆక్రమించిందని సర్వే పేర్కొంది. అయితే ఈ విషయంపై కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇంతవరకు నోరు మెదపలేదు. BIG: Nepali Congress (NC) have put resolution inside Parliament asking for national commitment to reclaim land #China has illegally encroached upon by shifting the border pillars towards the Nepali side. Nepali Congress has sought answers from the government about the reality. pic.twitter.com/qSdzEc1oF8 — Aditya Raj Kaul (@AdityaRajKaul) June 24, 2020 -
శ్మశాన స్థలం ఆక్రమణపై ఉద్రిక్తత
మూడు గంటల పాటు రాస్తారోకో ఇందుకూరుపేట : శ్మశాన స్థలాన్ని ఆక్రమించడంపై ఇందుకూరుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన కారులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కొత్తూరు పంచాయతీ పారువేటదిబ్బ శ్మశాన స్థలం వివాదం కొంత కాలంగా కొనసాగుతుంది. ఆ స్థలంలో సోమవారం హద్దు రాళ్లను నాటారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. నాటిన హద్దురాళ్లను ధ్వంసం చేశారు. గ్రామస్తులు మట్లాడుతూ ఇందుకూరుపేట, కొత్తూరు పంచాయతీలోని గ్రామస్తులుకు దశాబ్దాల కాలం నుంచి శ్మశానంగా ఉన్న స్థలం ఇప్పుడు పట్టాభూమిగా చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం శ్మశాన స్థల ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా శ్మశాన స్థలం ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. న్యాయం చేసేంత వరకు కదిలేదు లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి, వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలం చేరుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు నిరాకరించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు ఇరువర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని సీఐ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. నెలల నుంచి సమస్య కొనసాగుతున్నా.. నాయకులు ఎవరూ తమకు మద్దుతుగా నిలవకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పార్కు స్థలం ఆక్రమణకు ప్రయత్నం
రాత్రికి రాత్రే గోడ నిర్మాణం గోడ కూల్చివేసి నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నెల్లూరు(పొగతోట): చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని హెచ్‌పీ గోడౌన్ రోడ్డులో పార్కు కోసం కేటాయించిన కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ నాయకుడొకరు రాత్రికి రాత్రి ఆక్రమించే ప్రయత్నం చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలానికి చుట్టూ ప్రహరీ నిర్మించారు. విషయం తెలియడంతో 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య శుక్రవారం ఉదయం గోడ కూల్చి వేసి నిరసన లె లిపారు. వివరాలు..13, 14వ డివిజన్ల పరిధిలోని హెచ్‌పీ గోడౌన్ రోడ్డులో కార్పొరేషన్ అధికారులు 70 అంకణాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఈ స్థలం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుడొకరు దీనిపై కన్నేశారు. గురువారం రాత్రి పొద్దుపోయాక స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి ఇది తన భూమి చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రి వెలసిన గోడపై ఆ ప్రాంతంలోని జనం భగ్గుమన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మాధవయ్య అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేసి కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి గోడ నిర్మాణానికి వినియోగించిన బ్రిక్సును, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ విషయంపై మేయర్‌కు, కమిషనర్‌కు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ఇప్పటికైనా స్పందించి అక్రమణకు గురైన కార్పొరేషన్ స్థలాలకు పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, ఎస్.జయరామిరెడ్డి, నవీన్‌రెడ్డి, గిరిప్రసాద్, భాస్కర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, కృష్ణారెడ్డి, తారకేశ్వరరెడ్డి, ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
బడుగుకు భరోసా
* ప్రభుత్వ స్థలాల్లోని పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు * ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణపై కేసీఆర్ సమీక్ష * ఉత్తర్వులు వచ్చిన 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి * 25 గజాలు మించితే రిజిస్ట్రేషన్ ధరలో ముందుగా 25 శాతం డీడీ రూపంలో చెల్లించాలి * గత జూన్ 2 లోపు ఉన్న నివాసాలకే వర్తింపు, నివాస ధ్రువీకరణ తప్పనిసరి.. 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తికి కేసీఆర్ నిర్దేశం సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాల(125 గజాల్లోపు)ను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు తాజాగా ఆదేశించారు. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను రూపొందించేందుకు మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. భూముల క్రమబద్ధీకరణపై ఇటీవల అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలు ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్టవేయడం, ప్రతి భూమికి టైటిల్ కలిగి ఉండడం వంటి లక్ష్యాలను సాధించడమే క్రమబద్ధీకరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నిరుపేదలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి తల దాచుకోవడానికి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇళ్లు నిర్మించుకున్నారని, ఆక్రమిత భూములకు పట్టాలు లేకపోవడంతో వారు నిత్యం అవస్థలు పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. అలాంటి వారు నివాసముంటున్న స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేశ వరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్‌మీనా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ జి.డి.అరుణ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరచాల్సిన మార్గదర్శకాలను అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. ఇవీ మార్గదర్శకాలు.. * ఈ ఏడాది జూన్ 2లోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలి. దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను జతపరచాలి. * పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాల ఆదా య పరిమితిని రెండు లక్షలకు పెంచినందున, ఆలోపు ఆదాయమున్న వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలుగా గుర్తించాలి. * దరఖాస్తు చేసుకోవడానికి 20 రోజుల గడవు ఇవ్వాలి. దరఖాస్తుతోపాటు భూమికి నిర్ణయించిన ధరలో 25 శాతాన్ని డీడీ రూపంలో చెల్లించాలి. * ఆసుపత్రులు, విద్యా సంస్థలను కూడా వ్యాపార సంస్థలుగానే పరిగణించాలి. * జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన, ఫిర్యాదులపై విచారణ తదితరాలను చేపట్టాలి. * క్రమబద్ధీకరణను 90రోజుల్లో పూర్తి చేయాలి. * ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వేలం నిర్వహించాలి. విచారణ సందర్భంలో ఏ ప్రాంతంలో, ఎంత స్థలంలో, ఏ ఇంట్లో, ఎవరు నివాసముంటున్నారో గుర్తించి ఫొటోలను కూడా అధికారులు తీసుకోవాలి. * రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సహకరించడానికి పదవీ విరమణ చేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. * క్రమబద్ధీకరణ చేసిన తర్వాత ఆ కుటుంబంలోని మహిళల పేరిటే పట్టాలు ఇవ్వాలి. భూముల వేలానికి ఓకే జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వేలానికి సం బంధించి కూడా సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్న చిన్న బిట్లుగా ఉన్న భూమిని ప్రభుత్వం వినియోగించుకోలేకపోతున్నందున అవి కబ్జాకు గురవుతున్నాయని, అలాంటి వాటిని వేలం వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో కలెక్టర్లు ప్రతిపాదించిన భూములను వేలం వేసేందుకు అనుమతించారు. అలాగే హైదరాబాద్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేదని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని సీఎం ప్రస్తావించారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహించడానికి ఇదే కారణమన్నారు. నాలాలపై ఆక్రమణలను తొలగించే విషయంలో, వాటిని సక్రమంగా నిర్వహించే విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.