లక్నో: శ్రీరాముడు తమవాడేనని, అసలైన అయోధ్య నేపాల్‌లో ఉందని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. హిందూ మతతత్వ గ్రూప్‌నకు చెందిన అరుణ్ పాఠక్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి నేపాల్ పౌరుడిపై దౌర్జన్యం చేశాడు. అతనికి బలవంతంగా గుండు కొట్టించాడు. అంతటితో ఆగకుండా గుండుపై ‘జై శ్రీరాం’అని స్కెచ్ పెన్నులతో రాయించాడు. నేపాల్ పౌరున్ని బెదిరించి జై శ్రీరాం అని నినాదాలు చేయించాడు.
వారణాసిలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేపాల్ ప్రభుత్వం స్పందించింది. దాంతో భారత్‌లోని నేపాల్ రాయబాని నీలాంబర్ ఆచార్య ఈ ఉదంతాన్ని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హామినిచ్చారు. నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశామని, మిగతా వారికోసం గాలిస్తున్నామని వారణాసి పోలీస్ చీఫ్ అమిత్ పాఠక్ తెలిపారు.
(చైనా మద్దతుతోనే ఓలీ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment