తాలిబన్ల దెబ్బకు ఇండియాకు భారీ నష్టం | Taliban Stop Exports, Imports From India: FIEO | Sakshi
Sakshi News home page

తాలిబన్ల దెబ్బకు ఆగిపోయిన ఎగుమతులు, దిగుమతులు

Published Wed, Aug 18 2021 9:33 PM | Last Updated on Wed, Aug 18 2021 9:35 PM

Taliban Stop Exports, Imports From India: FIEO - Sakshi

రెండు దశాబ్దాల తర్వాత అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు భారతదేశంతో జరిగే అన్ని దిగుమతులు, ఎగుమతులను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఇఓ) బుధవారం తెలిపింది. పాకిస్తాన్ రవాణా మార్గాల ద్వారా సరుకు రవాణాను తాలిబన్లు నిలిపివేశారని, ఫలితంగా ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ తెలిపారు.

"వాస్తవానికి, మేము ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద భాగస్వాములలో ఒకటి. అఫ్గనిస్తాన్‌కు ఎగుమతుల విలువ సుమారు 835 మిలియన్ డాలర్లు, దిగుమతుల విలువ $510 మిలియన్ డాలర్లు. కానీ, వాణిజ్యంతో పాటు అఫ్గనిస్తాన్‌లో సుమారు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన 400 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి" అని సహాయ్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశం చక్కెర, ఫార్మాస్యూటికల్స్, దుస్తులు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, ట్రాన్స్ మిషన్ టవర్లను అఫ్గనిస్తాన్‌కు ఎగుమతి చేస్తుంది అని అన్నారు. ఆ దేశం నుంచి భారత్ గమ్, ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement