Pakistan Supports Talibans: కేవలం 75వేల మంది సభ్యులతో తాలిబన్లు.. నెలన్నర వ్యవధిలో సుమారు నాలుగు కోట్ల జనాభా ఉన్న అఫ్గనిస్థాన్‌ను వశపర్చుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో సైన్యం ఉపసంహరణ వల్లే ఈ పరిణామాలకు కారణమైందంటూ అమెరికాపై ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న అగ్రరాజ్యం.. నిందలను తోసిపుచ్చుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది. తాజాగా పాక్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చి తీవ్ర విమర్శలు గుప్పించింది.
పాకిస్థాన్, ఆ దేశపు ఇంటెలిజెన్స్ సర్వీస్ వల్లే తాలిబన్లు పాతుకుపోగలిగారు అని రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ చాబోట్ తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. ఇండియా కాకస్‌కు కోచైర్మన్ హోదాలో ఆదివారం జరిగిన హిందూ పొలిటికల్ యాక్షన్ కమిటీ వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొని ఆయన ప్రసంగించాడు. అఫ్గనిస్థాన్ గడ్డపై ప్రస్తుత పరిస్థితులకు పాక్ ఒక కారణం. తాలిబన్లకు వెన్నుదన్నుగా నిలిచి.. దురాక్రమణకు సహకరించింది పాక్.
అంతేకాదు అఫ్గన్‌ల నరకయాతన గురించి తెలిశాక.. ఇస్లామాబాద్ సహా పాక్‌లోని పలు ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. పాక్ రాజకీయ నాయకులు, అధికారులు సంబురంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రోడ్ల మీదకు చేరి నృత్యాలు చేసిన దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయని చాబోట్ ఉటంకించాడు. ఇక పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గన్‌ల నుంచి భారీ డబ్బు వసూలు చేసి.. పాక్ భూభాగంలో ఆశ్రయం ఇస్తున్నారని విమర్శించాడు. ‘ఇవి చాలావా! పాక్ తాలిబన్లకు ఎంత సహకారాలు అందిస్తుందో.. అఫ్గన్‌ల నరకయాతనను చూసి వికృతానందం పొందుతుందో చెప్పడానికి’ అంటూ పాక్‌ను ఏకీపడేశాడు చాబోట్.
చదవండి: తాలిబన్లతో దోస్తీ.. చైనా భారీ పన్నాగం!!
పాక్ మంత్రికి అపాయింట్‌మెంట్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ అఫ్గనిస్థాన్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. అఫ్గన్ అల్లకల్లోల పరిస్థితుల్లో అక్కడ పర్యటిస్తున్న తొలి విదేశీ నేత ఖురేషీ కావడం విశేషం. హక్కానీ నెట్‌వర్క్ అఫ్గన్ స్వాధీన ప్రకటన తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సహకరిస్తామని, తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తామని పాక్ బహిరంగ ప్రకటనచ చేసింది కూడా. దీంతో చైనా, ఇరాన్ తర్వాత తాలిబన్లకు పాక్ మద్దతు ప్రకటించిన దేశంగా నిలిచింది. అయితే తాలిబన్లకు పాక్ సహకారం ఉందన్న బహిరంగ ఆరోపణల నేపథ్యంలోనే .. ఆ దేశ మంత్రి తాలిబన్లతో చర్చలు జరుపుతుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment