
భారత్‌లో హిజాబ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో వివాదం చేటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కర్టాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. దేశంలోని పలు రాష్ట్రాలకు పాకుతోంది. ఇదిలా ఉండగా మతం పేరుతో మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరించే తాలిబన్లు.. హిజాబ్ విషయంలో తాజాగా కఠిన ఆదేశాలు జారీచేశారు.
అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం.. మహిళలు బుర్ఖా తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు ధరించాల్సిందేనని పేర్కొంది. మహిళలు పనిచేసే చోట తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని, లేదంటే చద్దర్ అయినా ముఖానికి అడ్డుగా పెట్టుకొవాలని పేర్కొంది.
అయితే తాలిబన్ ప్రభుత్వ ఏర్పడిన మొదట్లో దేశ మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించింది. కొన్ని రోజుల తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకొని.. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో.. బుర్ఖా, హిజాబ్ ధరించడం, గైడ్‌లైన్స్‌ను పాటించకపోతే సదరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment