ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇందుకోసం తాలిబన్లతో చర్చలు ప్రారంభించానని తెలిపారు. తజకీలు, హజారాలు, ఉజ్బెక్‌లకు ప్రభుత్వంలో వాటా ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. అయితే, చర్చల వివరాలను ఆయన బయటపెట్టలేదు. చదవండి: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు
ప్రజల హక్కులను గౌరవం లభించేలా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తాలిబన్లకు ఇమ్రాన్ హితవు పలికారు. అఫ్గాన్ గడ్డ మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారొద్దని చెప్పారు. అఫ్గానిస్తాన్‌లోని కొత్త ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా పాకిస్తాన్ చొరవ చూపాలంటూ షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్య దేశాలు కోరిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటన చేయడం విశేషం. తాలిబన్ల ప్రభుత్వ మంత్రివర్గంలోని 33 మందిలో తజకీలు, మహిళలకు ప్రాతినిథ్యం దక్కకపోవటం గమనార్హం. చదవండి: అమెరికాపై ఫ్రాన్స్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment