
కాబూల్: ‘‘మీ మౌనం మాకు ప్రాణాంతకం.. త్వరపడండి...వదిలేయకండి.. సాయం చేయండి’’ అంటూ అంతర్జాతీయ సినిమా ప్రపంచానికి సుప్రసిద్ధ అఫ్గాన్ చిత్ర నిర్మాత, దర్శకురాలు సహ్రా కరీమీ లేఖ రాసినట్టుగా ఆమె భయపడినంతా జరుగుతోంది. ఇది అంతర్యుద్ధం కాదు. ప్రచ్చన్న యుద్ధం. ఇది మాపై బలవంతంగా రుద్దిన యుద్ధం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఊహించినట్టుగానే అఫ్గన్ తాలిబన్ల వశమైంది.
మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గన్ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తాలిబన్ల కాల్పులు, దాడులతో దేశంలోని అనేక ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి.
-సాక్షి, వెబ్‌డెస్క్
(అఫ్గాన్‌ను సాయుధ తాలిబన్లు కైవసం చేసుకోక ముందు ప్రపంచానికి సహ్రా రాసిన కన్నీటి అభ్యర్థన ఈ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment