భారత సైనికులు (ఫైల్)
సాక్షి, కుప్వారా: కశ్మీర్ లోయలో మళ్లీ రక్తపాతం జరిగింది. బుడ్గం జిల్లాలో శుక్రవారం భారత ఆర్మీ జరిపిన వివిధ ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో సైనికులు మూడు ఎన్‌కౌంటర్లు జరపడం విశేషం. బాలాకోట్ దాడుల తర్వాత కూడా తన బుద్ధి మార్చుకోకుండా సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ కవ్విస్తున్న దాయాది పాక్‌కు, ఈ ఎన్‌కౌంటర్లతో భారత్ గట్టిసమాధానమిచ్చినట్లైంది.
బుడ్గాం జిల్లాలోని పారిగ్రామ్ ప్రాంతంలో భారత ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌లు కలసి శుక్రవారం నిర్వహించన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి ఎమ్16 రైఫిళ్లను ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం షోపియాన్ జిల్లాలోని యార్వాన్ అడవి, కుప్వారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మన సైనికులు చేసిన ఎన్‌కౌంటర్లలో నలుగురు మిలిటెంట్లు చనిపోయారు. ఈ దాడులలో పలువురు జవాన్లకూ గాయాలైనట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment