కశ్మీర్లోని షాపియాన్ జిల్లాలో మంగళవారం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు భద్రతా బలగాలు బుధవారం గుర్తించారు. మరికొందరి కోసం బలగాల గాలింపుల చర్యలు కొనసాగుతున్నాయి. షాపియాన్లోని షెర్మల్ ప్రాంతంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొచ్చుకొచ్చారన్న సమాచారం అందుకున్న భద్రత బలగాలు వారికోసం మంగళవారం సాయంత్రం నుంచి గాలింపులు కొనసాగిస్తున్నాయి. రాత్రిపూట గాలింపు చర్యలు నిలిపివేసి తిరిగి ఈ రోజు ఉదయం ప్రారంభించారు.