కశ్మీర్‌లో ఐదుగురు మిలిటెంట్ల హతం | 5 militants killed in Shopian encounter | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఐదుగురు మిలిటెంట్ల హతం

Published Sun, Aug 5 2018 5:19 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

5 militants killed in Shopian encounter - Sakshi

శ్రీగనర్‌: కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం చెలరేగిన ఘర్షణల్లో ఒక పౌరుడు మరణించాడు. కిలూరా అనే గ్రామంలో శుక్రవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక టెర్రరిస్టు శుక్రవారం మరణించగా, మరో నలుగురిని శనివారం ఉదయం హతమార్చినట్లు సైన్యం వెల్లడించింది. ఈ ఉగ్రవాదులంతా స్థానిక యువతే. ఎన్‌కౌంటర్‌ ముగిశాక ఘటనాస్థలంలో భారీగా గుమిగూడిన స్థానికులు భద్రతా దళాలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కాల్పుల్లో చనిపోయిన ఓ ఉగ్రవాది మృతదేహానికి గానోపురాలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పోలీసు కాల్పుల్లో ఒక పౌరుడు బలయ్యాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement