జమ్ము కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడితో పాటు నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ చేపట్టగా మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన ప్రతికాల్పుల్లో ముగ్గురు నలుగురు మిలిటెంట్లు మరణించారని కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.