Encounter in Srinagar
-
భారీ ఉగ్ర ముప్పు తప్పింది!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్ దేశంలో తలపెట్టిన భారీ ఉగ్రవాద విధ్వంసాన్ని అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భద్రతా బలగాల అప్రమత్తత వల్ల పెద్ద ఉపద్రవం తప్పిందన్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ఉన్నతాధికారులతో కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి, సీనియర్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడంలో భద్రతా బలగాలు గొప్ప శౌర్యసాహసాలను ప్రదర్శించాయి. వారి వద్ద భారీ ఎత్తున లభించిన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు వారు భారీ ఉగ్రదాడికి పన్నాగం పన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భద్రతా బలగాల అప్రమత్తతతో పెద్ద విధ్వంసం తప్పింది’ అని ఆ సమావేశం తరువాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘భద్రతా బలగాల అప్రమత్తతకు అభినందనలు. వారు జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో జరగనున్న ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే క్రూరమైన కుట్రను విజయవంతంగా అడ్డుకున్నారు’ అని మరో ట్వీట్లో ప్రశంసించారు. ముంబై దాడులు జరిగిన నవంబర్ 26న, అదే తరహాలో భారీ ఉగ్ర దాడి చేయాలని టెర్రరిస్టులు కుట్రపన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్ హైవేపై నగ్రోటా వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న ట్రక్‌లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. భారత్‌లో భారీ ఉగ్రదాడి లక్ష్యంతో వారు ఈ మధ్యనే పాక్ సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చినట్లు భద్రతావర్గాలు భావిస్తున్నాయి. -
ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఆదివారం ఉదయం జదిబాల్, పోజ్వల్‌పోరా ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ మొదలైంది. కనీసం ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావించిన అధికారులు టెర్రరిస్టుల తల్లిదండ్రులను ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చి వారిని లొంగిపోమని చెప్పినా అందుకు ఒప్పుకోలేదని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు. శ్రీనగర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని తెలిసింది. కాగా మరణించిన వారిలో ఒకరు 2019 నుంచి టెర్రరిస్టు ఆపరేషన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారని.. మరొకరు గత నెలలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్లో సీఆర్పీఎఫ్కు చెందిన ముగ్గురు సిబ్బందితో పాటు, ఓ పోలీసు గాయపడ్డారు. కాగా.. శ్రీనగర్‌లో కేవలం ఒక నెల వ్యవధిలోనే ఇది రెండవ ఎన్కౌంటర్. గత మే నెలలో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందని ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. చదవండి: 24 గంటల్లో ఎనిమిది మంది హతం -
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం
-
కశ్మీర్ ఎన్కౌంటర్ : నలుగురు మిలిటెంట్లు హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడితో పాటు నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ చేపట్టగా మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన ప్రతికాల్పుల్లో ముగ్గురు నలుగురు మిలిటెంట్లు మరణించారని కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కాగా పోలీసులకు తమ సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో మిలిటెంట్లు ఇటీవల ఇద్దరు టీనేజర్లను అపహరించి దారుణంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించి భారత పోస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగాయి. భారత దళాలు పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చాయి. -
ఎన్కౌంటర్లో మసూద్ అజర్ బంధువు హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు దగ్గరి బంధువు మహ్మద్ ఉస్మాన్ హతమయ్యాడు. త్రాల్ ప్రాంతంలో గత 10 రోజుల్లో భద్రతా దళాలపై జరిగిన దొంగచాటు దాడులకు ఉస్మాన్ నాయకత్వం వహించినట్లు సమాచారం. మంగళవారం నాటి ఎన్కౌంటర్ కూడా త్రాల్ ప్రాంతంలోనే జరగ్గా జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఒక ఎం–4 కార్బైన్ తుపాకీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలపై దొంగచాటుగా కాల్పులు జరిపేందుకు ఈ తుపాకులను వారు ఉపయోగించి ఉండొచ్చని అధికారులు చెప్పారు. మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌తో భద్రతా దళాలకు ఈ ఏడాదిలోనే గొప్ప విజయం లభించినట్లైందని ఓ అధికారి పేర్కొన్నారు. -
ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్ : ఇద్దరు ఉగ్రవాదులను సోమవారం అర్థరాత్రి భద్రతాదళాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. షోపియన్‌లోని వానీపోరా ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారం ఆ ప్రదేశాన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అనంతరం వెతుకులాట ప్రారంభించామని, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు వారిని కాల్చివేశాయని వివరించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. మూడో ఉగ్రవాదిని పట్టుకునేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నట్లు చెప్పారు. -
జెండా ఎగురవేసిన గంటకే..!
-
జెండా ఎగురవేసిన గంటకే..!
దేశభక్తుడైన ఆ సైనికాధికారి సోమవారం ఉదయం 8.29 గంటలకు మువ్వన్నెల జాతీయపతాకాన్ని ఎగురవేశాడు. ఆకాశంలో రెపరెపలాడుతున్న జెండాకు సెల్యూట్ చేసి.. జాతీయగీతాన్ని ఆలపించాడు. అనంతరం తన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశభక్తిని రగిలించే స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే తన కర్తవ్యదీక్షలో నిమగ్నమైన ఆయనను మృత్యువు వెంటాడింది. జాతీయజెండా ఎగురవేసిన గంటసేపటికే ఆయన జాతీయజెండాలో చుట్టబడిన అమరవీరుడిగా మారిపోయారు. ఆయనే సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రమోద్ కుమార్. స్వాతంత్ర్య దినోత్సవమైన సోమవారం శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతంలో మిలిటెంట్లతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన ప్రాణాలు విడిచారు. శ్రీనగర్ లోని కరన్ నగర్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో కమాండెంట్ ప్రమోద్ ఉదయం జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ సీఆర్పీఎఫ్ డీజీ సందేశాన్ని తన సైనిక బృందానికి వినిపించారు. దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. 'ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు కశ్మీర్ లో రాళ్లు విసురుతుండటాన్ని కూడా మనం ఎదుర్కొంటున్నాం. మనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ దేశ సమగ్రత, సమైక్యత, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను నిలబెట్టేందుకు కృషిచేద్దాం. ఎంతో మహత్తరమైన పోరాటం తర్వాత ఇవి మనకు లభించాయి' అని ఆయన పేర్కొన్నారు. అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని నౌవాట్టా ప్రాంతంలో ఇద్దరు మిలిటెంట్లు కాల్పులకు దిగారని సమాచారం అందడంతో ఆయన వెంటనే సీఆర్పీఎఫ్ బృందంతో అక్కడికి చేరారు. మిలిటెంట్లతో జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రమోద్ నాయకత్వం వహించారు. ఆయన గన్ నుంచి దూసుకుపోయిన తూటా ఓ మిలిటెంట్ ను హతమార్చింది. కానీ అంతలోనే ఓ మిలిటెంట్ తూటా వచ్చి ఆయన మెడకు దిగింది. కోమాలోకి వెళ్లిపోయిన ఆయనను వెంటనే శ్రీనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయిందని, మధ్యాహ్నానికి ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి భవేష్ చౌదరి తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో మరో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ఓ కశ్మీర్ పోలీసు అధికారి కూడా గాయపడ్డారు. తలలో తూటా దిగిన పోలీసు అధికారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.