శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఆదివారం ఉదయం జదిబాల్, పోజ్వల్‌పోరా ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. కనీసం ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భావించిన అధికారులు టెర్రరిస్టుల తల్లిదండ్రులను ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చి వారిని లొంగిపోమని చెప్పినా అందుకు ఒప్పుకోలేదని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు.
శ్రీనగర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని తెలిసింది. కాగా మరణించిన వారిలో ఒకరు 2019 నుంచి టెర్రరిస్టు ఆపరేషన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారని.. మరొకరు గత నెలలో బీఎస్‌ఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సీఆర్పీఎఫ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందితో పాటు, ఓ పోలీసు గాయపడ్డారు. కాగా.. శ్రీనగర్‌లో కేవలం ఒక నెల వ్యవధిలోనే ఇది రెండవ ఎన్‌కౌంటర్. గత మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందని ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. చదవండి: 24 గంటల్లో ఎనిమిది మంది హతం
Comments
Please login to add a commentAdd a comment