శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడితో పాటు నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ చేపట్టగా మిలిటెంట్లు భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన ప్రతికాల్పుల్లో ముగ్గురు నలుగురు మిలిటెంట్లు మరణించారని కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
కాగా పోలీసులకు తమ సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో మిలిటెంట్లు ఇటీవల ఇద్దరు టీనేజర్లను అపహరించి దారుణంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణను ఉల్లంఘించి భారత పోస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగాయి. భారత దళాలు పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment