శ్రీనగర్: కశ్మీర్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. బుద్గాం, బారాముల్లా జిల్లాల్లో ఈ ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫుత్లిపొరాలోని పకేపొరా ప్రాంతంలో మిలిటెంట్లు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.
ఈ క్రమంలో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మృతి చెందారని చెప్పారు. వీరు జైషే మొహమ్మద్‌తోపాటు పాకిస్తాన్‌కు చెందిన మరో ఉగ్ర సంస్థ మిలిటెంట్లని చెప్పారు. బారాముల్లా జిల్లాలోని బోమైలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో లష్కరే మిలిటెంట్ ముజామిల్‌ను హతమార్చారు.
ఈ ఏడాది 200 మంది హతం: డీజీపీ
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో 200 మందికిపైగా మిలిటెంట్లను హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. దేశం, జమ్మూ కశ్మీర్‌లో శాంతి స్థాపనకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment