KASHMIR ENCOUNTER
-
అమర జవాన్‌కు సీఎం జగన్ నివాళి, రూ.50 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం తెలియగానే.. తక్షణమే స్పందించారు. దేశరక్షణకోసం కశ్మీర్లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్ జశ్వంత్‌రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.#jaswanthreddy — YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2021 -
ఐదుగురు మిలిటెంట్ల హతం
శ్రీనగర్: కశ్మీర్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. బుద్గాం, బారాముల్లా జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫుత్లిపొరాలోని పకేపొరా ప్రాంతంలో మిలిటెంట్లు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడటంతో ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మృతి చెందారని చెప్పారు. వీరు జైషే మొహమ్మద్‌తోపాటు పాకిస్తాన్‌కు చెందిన మరో ఉగ్ర సంస్థ మిలిటెంట్లని చెప్పారు. బారాముల్లా జిల్లాలోని బోమైలో జరిగిన మరో ఎన్కౌంటర్లో లష్కరే మిలిటెంట్ ముజామిల్‌ను హతమార్చారు. ఈ ఏడాది 200 మంది హతం: డీజీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జమ్మూ కశ్మీర్లో 200 మందికిపైగా మిలిటెంట్లను హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ట్వీటర్లో పేర్కొన్నారు. దేశం, జమ్మూ కశ్మీర్లో శాంతి స్థాపనకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. -
కశ్మీర్లో జవాను బలి
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసినట్లు ఆర్మీ తెలిపింది. అయితే ఎదురుకాల్పుల్లో ఓ జవాను మరణించినట్లు పేర్కొంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా జవాన్లు కాల్పులు జరపడంతో పారిపోయారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. -
ఎన్కౌంటర్లో సైనికాధికారితోపాటు తీవ్రవాదులు హతం
కుప్వారా జిల్లా క్లార్పొరా ప్రాంతంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికాధికారితోపాటు ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. మరో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు భద్రత ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. అటు భద్రత దళాలు, ఇటు తీవ్రవాదుల మధ్య గత రాత్రి నుంచి హోరాహోరి కాల్పులు జరిగాయని చెప్పారు. గాయపడిన పోలీసులు కుప్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.