అమర జవాన్‌కు సీఎం జగన్‌ నివాళి, రూ.50 లక్షల ఆర్థిక సాయం | Cm Ys Jagan Announces 50 Lakh Ex gratia to Kin of Deceased in Kashmir Encounter | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో గుంటూరు జవాన్‌ వీరమరణం.. ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్‌

Published Fri, Jul 9 2021 1:26 PM | Last Updated on Fri, Jul 9 2021 3:23 PM

Cm Ys Jagan Announces 50 Lakh Ex gratia to Kin of Deceased in Kashmir Encounter - Sakshi

సాక్షి, అమరావతి: ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు.

ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం తెలియగానే.. తక్షణమే స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement