
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్ : భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన ఆదివారం జమ్మూ కశ్మీర్ రాష్ర్టం షోపియాన్ జిల్లాలోని పాహ్నూలో జరిగింది. కాపలా నిర్వహిస్తోన్న మొబైల్ చెక్ పోస్టు వాహనంపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరపటంతో ప్రతిగా భద్రతాబలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించినట్లు రక్షణా శాఖ అధికార ప్రతినిథి కల్నల్ రాజేష్ కలియా ధృవీకరించారు. ఉగ్రవాదుల వేట కొనసాగుతోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment