కాబూల్: ఆప్ఘనిస్తాన్ భద్రతా బలగాల కాల్పుల్లో సుమారు 33 మంది మిలిటెంట్లు మృతిచెందారు. నంగర్‌హర్ ప్రావిన్స్‌లో మిలిటెంట్ల కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు అక్కడికి చేరుకుని వారిని మట్టుపెట్టినట్లు ఓ ఆర్మీ అధికారి శుక్రవారం వెల్లడించారు. చాపరహర్, పాచిరాగమ్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు.
బలగాల తనిఖీని గుర్తించిన మిలిటెంట్లు ఆర్మీ సిబ్బందిపై కాల్పులు ప్రారంభించాయి. వెంటనే స్పందించిన ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో 33 మంది ఉగ్రవాడులు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తనిఖిలలో భాగంగా 22 మంది మిలిటెంట్లని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్మీ కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు హతం
Published Fri, Mar 31 2017 7:52 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement