కోల్‌కతా : దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలను వైవిథ్యభరితంగా తీర్చిదిద్దే భక్తులు ఈసారి బాలాకోట్ వైమానిక దాడులను థీమ్‌గా ఎంచుకుని మండపం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమయ్యారు. కోల్‌కతాలోని ఓ దుర్గాపూజా కమిటీ భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసిన ఘటనను థీమ్‌గా ఎంచుకుంది. 50 ఏళ్లుగా దుర్గా మండపాలను ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కోల్‌కతాలోని యంగ్ బాయ్స్ క్లబ్ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ క్లే మోడల్స్, డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా వైమానిక దాడులను ప్రజల కళ్లకు కట్టేలా ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. మండపం ఎంట్రన్స్‌లో వైమానిక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకోవడం, ఉగ్రవాదులు మరణించిన, పారిపోతున్న దృశ్యాలు, వాటిపై ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ తిరుగుతుంటేలా 65 మోడల్స్‌తో డిస్‌ప్లే ఏర్పాటు చేశామని కమిటీ ప్రతినిధి విక్రాంత్‌సింగ్ వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లైఫ్‌సైజ్ మోడల్ సందర్శకులను పలుకరించలేలా అమర్చుతున్నామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment