అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న అలెప్పో నగరంపై మంగళవారం రష్యా జరిపిన వైమానిక దాడుల్లో...
19 మంది మృతి
బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న అలెప్పో నగరంపై మంగళవారం రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పౌరులు మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడులు రష్యా గానీ, ప్రభుత్వం గానీ జరిపి ఉండవచ్చని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల పరిశీలన బృందం ప్రతినిధి రమి అబ్దెల్ రెహమాన్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ వ్యతిరేక దళాలపై రష్యా విమానాలు చేసిన దాడిలో 12 మంది తిరుగుబాటుదారులు కూడా మృతిచెందారు. సిరియాలో తిరుగుబాటుదారులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 2.9 లక్షల మంది పౌరులు బలయ్యారు.