316 కు చేరిన గాజా మృతుల సంఖ్య! | Gaza toll reaches 316 as UN chief heads to region | Sakshi
Sakshi News home page

316 కు చేరిన గాజా మృతుల సంఖ్య!

Published Sat, Jul 19 2014 4:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

Gaza toll reaches 316 as UN chief heads to region

గాజా: ఇజ్రాయిల్ చేస్తున్న భూతల దాడుల్లో అమాయకులు ప్రాణాల గాల్లో కలిసిపోతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్, పాలస్తీనా ల చోటు చేసుకున్నఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ  316 మంది మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు. హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తొలిసారిగా భూతల దాడులకు దిగింది. వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది.  హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది.

 

శనివారం జరిపిన ఇజ్రాయిల్ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నందున ఇజ్రాయిల్ దాడులు పరిధికి లోబడే ఉండాలని సూచించింది.ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ దాడుల వల్ల అత్యధిక సంఖ్యలో అమాయకులు వారి జీవితాల్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement