Palestinian crisis
-
మనవాళ్ళకి ఎందుకంత ఆందోళన?
ప్రస్తుతం ఇజ్రాయెల్– పాలస్తీనియన్ల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం స్వయం ప్రకటిత మేధావులమని చెప్పుకునే మనదేశంలోని కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒకటే గోల! హమాస్ చర్యలను ప్రామాణీకరిస్తూ సంఘీభావ ర్యాలీలు తీయడం, హమాస్ దాడుల తరహాలో భారతదేశంలో కూడా దాడులు చేయాలంటూ దేశ సమగ్రతకు సవాలు విసిరే విధంగా వీడియోల పోస్టింగులు!! భారతదేశం భద్రతను దృష్టిలో ఉంచుకున్న భారత ప్రభుత్వం హమాస్ తీవ్రవాద చర్యలను నిర్ద్వంద్వంగా ఖండించింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన సంఘీభావాన్ని కూడా ప్రకటించింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా బలి అవుతున్న సామాన్య ప్రజల మృత్యు ఘోషకు తీవ్ర సంతాపం కూడా తెలియజేసింది. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని కూడా అందిస్తోంది. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న జిహాదీ ఉగ్రవాదాన్నీ, రక్షణ పరంగా ఇజ్రాయెల్‌కు మనకు ఉండే ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని, మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ హితాన్ని కోరే వాళ్ళందరూ స్వాగతించారు. కానీ కొందరు వ్యతి రేకిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ హమాస్ చర్యలను సమర్థిస్తోంది. దీని వెనుక ఈ దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించే ప్రయోజనం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే 1948కు ముందు ఇజ్రాయెల్ అనే పేరుతో ఒక భూ భాగమే లేదనేది అక్షర సత్యం. 1947 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ప్రపంచ పటంలో లేవు అనేది కూడా సత్యమే కదా? వాటి మునుగడను భారతదేశం కాదంటుందా? ఇజ్రాయెల్ మను గడను ప్రశ్నించే వారికి ఈ సమాధానం సరిపోదా? పెట్టుబడిదారీ పశ్చిమ దేశాలు మధ్య ఆసియాలో తమ రాజకీయ అవసరాల కోసమే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్ దేశాల మధ్యలో ఇజ్రాయెల్ ను సృష్టించాయి. ‘జెరూసలేం’ ప్రాంతం తమ ఆధ్యాత్మిక, మత, సాంస్కృతిక భావాలకు కేంద్రం అని రెండువేల ఏళ్లుగా యూదు జాతీయులు చెప్పుకొంటు న్నారు. యూదులపై దయతో పశ్చిమ దేశాలు వారికి ఒక భూభాగాన్ని కేటాయించాయని చెప్తే సత్య దూరమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ దేశాలు 60 లక్షల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా మట్టుబెట్టాయనేది చరిత్ర చెప్పే చెరపలేని సాక్ష్యం. ఇక పాలస్తీనా ఒక స్వతంత్ర భూభా గమనీ, దానిని దురహంకార పూరితమైన ఇజ్రాయెల్ దేశం ఆక్రమించిందనీ మన దేశంలోని చారిత్రిక పరిజ్ఞానం లేని కొంతమంది మూర్ఖపు వాదనలు చేస్తూ, దేశ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం పాలస్తీనా భూభాగాలుగా చెప్పుకొనే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలు 1967 వరకు వరుసగా ఈజిప్టు, జోర్డాన్ దేశాలలో భాగాలు. జోర్డాన్ నదికి పడమర వైపున ఉండే ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్నారనేది గమనార్హం. ఇస్లాం మతస్థులకు ‘జెరూసలేం’ పవిత్ర స్థలం కూడా. అందుకే ఇజ్రాయెల్ ఏర్పాటును ముస్లిం దేశాలన్నీ వ్యతిరేకించాయి. ఇక క్రైస్తవులకు ‘జెరూసలేం’, ‘బెత్లె హేము’ పవిత్ర స్థలాలు. క్రైస్తవుల ప్రాబల్యం నిలుపుకోవాలంటే అక్కడ పశ్చిమ దేశాలకు తమకు అనుకూలమైన దేశం ఒకటి ఉండాలి. ఇజ్రాయెల్ ఏర్పాటు వెనుక ఉన్న సూత్రం ఇదే! అరబ్ – ఇజ్రాయెల్ ఐదు యుద్ధాల్లో ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ మట్టి కరిపించడం వెనక దాగి ఉన్న రహస్యం కూడా ఇదే! పశ్చిమ దేశాలన్నీ కూడా ఇజ్రాయెలీలకు ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది వాస్తవం. ఇక హమాస్ చర్యలు పాలస్తీనియన్ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించి వేస్తాయనేది కాదనలేని సత్యం. గాజా స్ట్రిప్‌లోని ఇంటర్నల్ బంకర్లను ధ్వంసం చేసేంతవరకూ ఇజ్రాయెల్ ఆగదు. ఇదే జరిగితే అనేకమంది సామాన్య ప్రజలు బలి అవుతారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై దృష్టిని సారించి, హమాస్ తీవ్రవాదుల చెరలో బందీ లుగా ఉన్న యూదులను విడిపించే ఏర్పాట్లు చేయాలి. అదే విధంగా ఇజ్రాయెల్ దుందు డుకు చర్యలకు అడ్డుకట్ట కూడా వేయాలి. - వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
316 కు చేరిన గాజా మృతుల సంఖ్య!
గాజా: ఇజ్రాయిల్ చేస్తున్న భూతల దాడుల్లో అమాయకులు ప్రాణాల గాల్లో కలిసిపోతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్, పాలస్తీనా ల చోటు చేసుకున్నఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 316 మంది మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు. హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తొలిసారిగా భూతల దాడులకు దిగింది. వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది. శనివారం జరిపిన ఇజ్రాయిల్ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నందున ఇజ్రాయిల్ దాడులు పరిధికి లోబడే ఉండాలని సూచించింది.ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ దాడుల వల్ల అత్యధిక సంఖ్యలో అమాయకులు వారి జీవితాల్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇజ్రాయిల్ దాడుల్లో 260కు చేరిన మృతుల సంఖ్య
గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చింది. గత 11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 260 మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు. హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ ఇపుడు తొలిసారిగా భూతల దాడులకు దిగింది. పదిరోజుల దాడుల్లో దాదాపు 260మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే, ఇజ్రాయెల్‌పై పాలస్తీనా రాకెట్ దాడులు మాత్రం ఆగలేదు. తాజాగా గురువారం రాత్రి గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 27 మంది పాలస్తీనా వాసులు మరణించారు. వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది. -
‘ఇజ్రాయెల్’పై రాజ్యసభలో రగడ
పాలస్తీనా-ఇజ్రాయెల్ అంశంపై చర్చకు విపక్షం పట్టు; అంగీకరించని ప్రభుత్వం న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభంపై చర్చించాలంటూ ప్రతిపక్షం పట్టుబట్టడంతో బుధవారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దాదాపు ప్రతిపక్షమంతా ఈ విషయంపై చర్చకు పట్టుబట్టగా.. ఆ రెండు దేశాలతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయని, చర్చను చేపట్టడం వల్ల ఆ దేశాలతో దౌత్య సంబంధాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ చర్చకు ప్రభుత్వం తిరస్కరించింది. విపక్ష సభ్యులు పట్టు విడవకపోవడంతో సభను రెండుసార్లు వాయిదావేశారు. జీరో అవర్ ప్రారంభం కాగానే.. జీరో అవర్ జాబితాలో ‘పాలస్తీనాలోని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై చర్చ’ అంశం ఉందంటూ.. ఈ విషయంపై మాట్లాడాల్సిందిగా జేడీయూ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీని సభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కోరారు. అయితే, ఈ విషయంపై చర్చకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అంగీకరించలేదు. ‘ఈ రోజు సభాకార్యక్రమాల జాబితాలో ఈ విషయం ఉందన్న విషయం ఉదయమే తెలిసింది. నాతో సంప్రదించకుండానే దీన్ని జాబితాలో చేర్చారు. అందుకే చైర్మన్‌పై ఉన్న గౌరవంతో ఈ విషయం చెప్పేందుకు సభకు వచ్చాను’ అని వెల్లడించారు. మరోపక్క.. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై లోక్‌సభలో విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.ఆకాశాన్నంటిన ధరల విషయంలో తగిన చర్యలు తీసుకోలేదని, భారీ మెజారిటీతో నెగ్గినప్పటికీ పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నాయి. తమ హయాంలో పాదుకొల్పిన ఆర్థిక పునాదులను మరింత పటిష్టం చేయడంలో మోడీ సర్కారు విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. బడ్జెట్లో సాహసోపేత నిర్ణయాలు ఉంటాయని ఆశించి నిరాశచెందామని పేర్కొంది.