Human-free flights
-
316 కు చేరిన గాజా మృతుల సంఖ్య!
గాజా: ఇజ్రాయిల్ చేస్తున్న భూతల దాడుల్లో అమాయకులు ప్రాణాల గాల్లో కలిసిపోతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్, పాలస్తీనా ల చోటు చేసుకున్నఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 316 మంది మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు. హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తొలిసారిగా భూతల దాడులకు దిగింది. వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది. శనివారం జరిపిన ఇజ్రాయిల్ దాడుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నందున ఇజ్రాయిల్ దాడులు పరిధికి లోబడే ఉండాలని సూచించింది.ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ దాడుల వల్ల అత్యధిక సంఖ్యలో అమాయకులు వారి జీవితాల్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇజ్రాయిల్ దాడుల్లో 260కు చేరిన మృతుల సంఖ్య
గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చింది. గత 11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 260 మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు. హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ ఇపుడు తొలిసారిగా భూతల దాడులకు దిగింది. పదిరోజుల దాడుల్లో దాదాపు 260మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే, ఇజ్రాయెల్‌పై పాలస్తీనా రాకెట్ దాడులు మాత్రం ఆగలేదు. తాజాగా గురువారం రాత్రి గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 27 మంది పాలస్తీనా వాసులు మరణించారు. వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది. -
హమాస్ ద్రోన్ను కూల్చేసిన ఇజ్రాయెల్
గాజా/జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ సోమవారం కూడా వైమానిక దాడులు చేసింది. పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ తొలిసారి ప్రయోగించిన మానవ రహిత విమానాన్ని(ద్రోన్) కూల్చేసింది. తమ దేశంలోని అషదాద్ నగరానికి దగ్గర్లో తీరం వద్ద ఇది కనిపించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ పాలనలోని గాజాలో ఆ సంస్థకు చెందిన మూడు సైనిక శిక్షణ కేంద్రాలపై విమానాలతో బాంబు దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ దాడుల మృతుల సంఖ్య 175కు చేరింది. ఇజ్రాయెల్ భూభాగంలోని చాలా ద్రోన్లను పంపామని, వివరాలు తర్వాత వెల్లడిస్తామని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిన గాజాలోని బీత్ లహియాలో 17 వేల మంది రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి శిబిరాలకు చేరుతున్నారు. మరోవైపు.. లెబనాన్ నుంచి సోమవారం కూడా తమ భూభాగంలోకి రాకెట్ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇదిలా ఉండగా, గాజాపై దాడుల్లో అమాక ప్రజల మృతిపై జమ్మూకాశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చకు స్పీకర్ అంగీకరించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.