డెమాస్కస్: సిరియా దక్షిణ ప్రావెన్స్ ప్రాంతమైన దార్రాలోని జస్సెమ్ పట్టణాన్ని అక్రమించిన తిరుబాటుదారులపై ఆ దేశం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ సైనికాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
సిరియాలో తిరుగుబాటు దారులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సైన్యం గతేడాది నుంచి వైమానిక దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలరోజులుగా నిర్వహించిన వైమానిక దాడుల్లో 271 మంది పౌరులు మరణించగా, 190 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారని సైనికాధికారులు వివరించారు.