ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని బీరూట్‌లో మరోసారి దాడులతో విరుచుకుపడింది. తాజాగా గురువారం తెల్లవారుజామున బచౌరా జిల్లాలోని హెజ్‌బొల్లా రెస్క్యూ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. బీరూట్‌లోని దాహియాలో హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన ప్రదేశంలోనే ఇజ్రాయెల్ సైన్యం మూడు మిసైల్స్‌తో దాడి జరిపింది.
#WATCH | A plume of smoke billows into the sky in Beirut, Lebanon.
Reuters reports that Israel bombed central Beirut in the early hours of 3rd Oct, killing at least six people, after its forces suffered their deadliest day on the Lebanese front in a year of clashes against… pic.twitter.com/UiHcoe0AFr— ANI (@ANI) October 3, 2024
వారం రోజుల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన రెండో దాడి ఇది. హెజ్‌బొల్లాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉత్తర సరిహద్దును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో బీరూట్ ప్రాంతంలో పొగలు తీవ్రమైన పొగలు కమ్ముకున్నాయి.
మరోవైపు.. లెబనాన్‌లో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన అమెరికా పౌరుడు కామెల్ అహ్మద్ జావెద్‌కు సంతాపం ప్రకటించినట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment