బీరూట్: బీరూట్‌పై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. అయితే ఆయన హత్యకు ముందు కాల్పుల విరమణకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ అన్నారు. హత్యకు ముందే ఇజ్రాయెల్‌తో నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని తెలిపారు.
అదేవిధంగా కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయం గురించి నస్రల్లా అమెరికా, ఫ్రెంచ్ ప్రతినిధులకు కూడా తెలియజేసినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ బీరూట్‌పై వైమానిక దాడుల చేసినట్లు సమయంలో నస్రల్లా దక్షిణ శివారు ప్రాంతం దహియేలోని ఒక బంకర్‌లో ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు లెబనాన్ నుంచి పారిపోవాలని నస్రల్లాను హెచ్చరించినట్లు బుధవారం రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొంది.
ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన భారీ వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్‌బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: ఇజ్రాయెల్ వార్నింగ్ వేళ.. ఇరాన్ సుప్రీం నేత సంచలన ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment