న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లో జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది భారతీయులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. యెమెన్‌లోని హొదీదా ఓడరేవులో చమురు స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకుని సౌదీ దళాలు దాడులు జరిపాయని, స్థానిక జాలర్లు ఈ దాడుల్లో చనిపోయారని కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. మృతుల్లో దాదాపు 20 మంది భారతీయులు ఉన్నట్లు ఈ వార్తలు పేర్కొన్నాయి.
హోదీదా తీరానికి దగ్గరలో ఉన్న అల్ ఖోఖా ప్రాంతంలో రెండు జాలర్ల బోట్లు ధ్వంసం అయినట్లు కూడా తెలిపాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ధ్రువీకరణ కాలేదని, ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. యెమెన్‌లో భారత్‌కు దౌత్యకార్యాలయం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి భారతీయులందరినీ స్వదేశానికి తరలించిన తరువాత, దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేశారు.
యెమెన్‌లో 20మంది భారతీయుల మృతి!
Published Wed, Sep 9 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM
Advertisement
Advertisement