గాజాలో హమాస్ అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. శుక్రవారం సాయంత్రం జబాలియా క్యాంప్‌లోని అనేక ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో సుమారు 33 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
మృతిచెందిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. శిథిలాలు, భవనాల కింద చిక్కుకున్న అనేక మంది బాధితు ఉన్నారని పేర్కొంది. మొత్తం మరణాలు సంఖ్యల కూడా 50కి పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. బాంబుల దాడిలో 85 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. అయితే.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించకపోవటం గమనార్హం.
IT DOESN’T STOP #SaveNorthGaza
At least 33 Palestinians were killed and 50 wounded in an Israeli strike on Jabalia refugee camp in north Gaza.
Numbers expected to rise— Dr. Renee Levant (@ReneeLevant) October 19, 2024
అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్ సరిహద్దు గుండా హమాస్ విధ్వంసానికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను అంతం చేయటమే టార్గెట్‌గా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకు 42,500 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
చదవండి: సిన్వర్ మృతి వీడియోతో పాలస్తీనా కట్టలు తెగిన ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment