మాస్కో: సిరియాలో 24 గంటల వ్యవధిలో జరిపిన వరుస వైమానిక దాడుల్లో 120 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పాటు విదేశాల నుంచి వచ్చిన 60 మంది ఉగ్రవాదులు హతమైనట్టు రష్యా రక్షణ శాఖ శనివారం వెల్లడించింది. సిరియాలోని మాయాదీన్‌లో ఐఎస్‌లో కీలకమైన వ్యక్తులతో పాటు 80 మంది ఉగ్రవాదులను, అల్బు కమాల్‌లో మరో 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. డెయిర్ ఎజ్జర్‌లో జరిపిన మరో వైమానిక దాడిలో సోవియట్ యూనియన్, ట్యూనీషియా, ఈజిప్టుకు చెందిన 60 మంది విదేశీ ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొంది.
ఐఎస్ సీనియర్ కమాండర్, కరడుగట్టిన ఉగ్రవాది ఒమర్ అల్ షిషానీతో పాటు మరో ఇద్దరు కమాండర్లు సలాహ్ అల్ దిన్ అల్ షిషానీ, అలా అల్ దిన్ అల్ షిషానీ గతంలో జరిపిన దాడుల్లో మరణించినట్టు ధ్రువీకరించింది. ఒమర్ అల్ షిషానీని అమెరికా సేనలు హతమార్చినట్టు 2016లో పెంటగాన్ వెల్లడించడం గమనార్హం. అయితే సలాహ్ హతమైనట్టు రష్యా ప్రకటించడాన్ని బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల అబ్జర్వేటరీ రమీ అబ్దుల్ రహమాన్ తోసిపుచ్చారు. సలాహ్ బతికే ఉన్నాడని, అలెప్పో ప్రావిన్స్‌లో జిహాదీ గ్రూపులకు పట్టున్న ప్రాంతాల్లో అతను ఉండొచ్చని వెల్లడించారు. సలా‹ß జిహాదీ గ్రూపు అల్ నుస్రాతో కలసి పనిచేసేవాడు.
Comments
Please login to add a commentAdd a comment