jihadis
-
సిరియాపై బాంబుల వర్షం
మాస్కో: సిరియాలో 24 గంటల వ్యవధిలో జరిపిన వరుస వైమానిక దాడుల్లో 120 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పాటు విదేశాల నుంచి వచ్చిన 60 మంది ఉగ్రవాదులు హతమైనట్టు రష్యా రక్షణ శాఖ శనివారం వెల్లడించింది. సిరియాలోని మాయాదీన్లో ఐఎస్‌లో కీలకమైన వ్యక్తులతో పాటు 80 మంది ఉగ్రవాదులను, అల్బు కమాల్లో మరో 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. డెయిర్ ఎజ్జర్లో జరిపిన మరో వైమానిక దాడిలో సోవియట్ యూనియన్, ట్యూనీషియా, ఈజిప్టుకు చెందిన 60 మంది విదేశీ ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొంది. ఐఎస్ సీనియర్ కమాండర్, కరడుగట్టిన ఉగ్రవాది ఒమర్ అల్ షిషానీతో పాటు మరో ఇద్దరు కమాండర్లు సలాహ్ అల్ దిన్ అల్ షిషానీ, అలా అల్ దిన్ అల్ షిషానీ గతంలో జరిపిన దాడుల్లో మరణించినట్టు ధ్రువీకరించింది. ఒమర్ అల్ షిషానీని అమెరికా సేనలు హతమార్చినట్టు 2016లో పెంటగాన్ వెల్లడించడం గమనార్హం. అయితే సలాహ్ హతమైనట్టు రష్యా ప్రకటించడాన్ని బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల అబ్జర్వేటరీ రమీ అబ్దుల్ రహమాన్ తోసిపుచ్చారు. సలాహ్ బతికే ఉన్నాడని, అలెప్పో ప్రావిన్స్‌లో జిహాదీ గ్రూపులకు పట్టున్న ప్రాంతాల్లో అతను ఉండొచ్చని వెల్లడించారు. సలా‹ß జిహాదీ గ్రూపు అల్ నుస్రాతో కలసి పనిచేసేవాడు. -
గౌతమ్ గంభీర్‌కు కోపం వచ్చింది
-
గౌతమ్ గంభీర్‌కు కోపం వచ్చింది
టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్‌కు దేశభక్తి చాలా ఎక్కువ. పాకిస్తాన్ అంటే చాలు మనోడికి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. తాజాగా కశ్మీర్లో భారతీయ బలగాల మీద కొందరు దాడులు చేయడంతో గంభీర్ బాగా ఆవేశానికి గురయ్యాడు. భారతీయ సైనికుడి మీద ఒక్క దెబ్బ పడితే.. కనీసం వంద మంది జీహాదీల ప్రాణాలు తీయాలని అన్నాడు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలనే వాళ్లకు కూడా గట్టిగా బుద్ధి చెప్పాడు. మన జాతీయ పతాకంలో మూడు రంగులకు మంచి అర్థం ఉందని, అందులో కాషాయ రంగు ఆగ్రహంతో కూడిన మంట అయితే, తెలుపురంగు జీహాదీల శవం మీద కప్పే వస్త్రమని, ఆకుపచ్చ రంగు ఉగ్రవాదాన్ని ద్వేషించడమని తనదైన శైలిలో భాష్యం చెప్పాడు. ఈ మేరకు గురువారం నాడు వరుసపెట్టి ట్వీట్లు చేశాడు. భారతీయ జవాన్లను కశ్మీర్లో కొంతమంది జనాలు తిడుతూ కొడుతున్నట్లుగా వచ్చిన ఒక వీడియో చూసిన తర్వాత గంభీర్ ఈ విధంగా స్పందించాడు. తమకు స్వాతంత్ర్యం కావాలనుకునే వాళ్లు తక్షణం భారతదేశం వదిలి వెళ్లిపోవాలని స్పష్టం చేశాడు. ఇంతకుముందు కూడా గుర్మెహర్ కౌర్ అనే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని శాంతి సందేశాలు పోస్ట్ చేసినందుకు ఆమెను వెక్కిరించడమే కాక, అత్యాచారం చేస్తామని కూడా బెదిరించారు. ఆమెకు గంభీర్ మద్దతుగా నిలిచాడు. భారత సైన్యం అంటే తనకు చాలా గౌరవం ఉందని, వాళ్లు దేశానికి చేసే సేవతో పోలిస్తే మనం చేసేది ఏమీ కాదని అన్నాడు. భారతీయులంతా తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎలా స్వాతంత్ర్యం ఉందో, గుర్మెహర్కు కూడా అలాగే ఉందని, ఆమె అభిప్రాయాలతో ఏకీభవించచ్చు, లేకపోవచ్చు గానీ ఆమెను గేలిచేయడం మాత్రం సరికాదని అప్పట్లో చెప్పాడు. For every slap on my army's Jawan lay down at least a 100 jihadi lives. Whoever wants Azadi LEAVE NOW! Kashmir is ours. #kashmirbelongs2us — Gautam Gambhir (@GautamGambhir) 13 April 2017 Anti-Indians hav forgotten dat our flag also stands 4: saffron - fire of our anger, white - shroud for jihadis, green - hatred 4 terror. — Gautam Gambhir (@GautamGambhir) 13 April 2017 -
జిహాదీల మధ్య ఆటల పోటీలు
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇటీవలే బాంబులతో మారణహోమం సృష్టించిన ఐసిస్ టెర్రరిస్టులు ప్రజలను ఆకర్షించేందుకు మరో కొత్త అవతారం ఎత్తారు. తమలో కరుడుగట్టిన కాఠిన్యంతోపాటు క్రీడాస్ఫూర్తి కూడా ఉందని నిరూపించుకునేందుకు మినీ జిహాదీ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. జిహాదీల మధ్య ‘టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చెయిర్స్’ లాంటి ఆటల పోటీలను నిర్వహించారు. ఇరాక్‌లోని తమ ఆధీనంలోని తల్ అఫర్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పిల్లలకు గాలి బుడగలు ఊదడం లాంటి పోటీలు కూడా నిర్వహించారు. విజేతలందరికి పోటీల తర్వత స్వీటు ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ పోటీల్లో ఐదేళ్ల బాలలు కూడా పాల్గొనడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొనాలంటూ స్థానిక ప్రజలను ప్రోత్సహించారు. స్థానికుల్లో పిల్లలు తప్ప పెద్దలెవరూ హాజరు కాకపోయినా, వారంతా వచ్చి జీహాదిల మధ్య జరిగిన పోటీలను ప్రోత్సహించారు. జీహాదీలు బ్రిటిష్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల షర్టులను ధరించి మరీ పోటీల్లో పాల్గొన్నారు. ఇరాక్, సిరియా దేశాల్లో తమ ఆధీనంలోని నగరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చాటుకునేందుకే ఈ ఆటల పోటీలను నిర్వహించారని స్థానిక ప్రజలు వ్యాఖ్యానించారు. ఐసిస్ టెర్రరిస్టుల ట్విట్టర్ వినియోగం గత రెండేళ్లలో 45 శాతం తగ్గిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే జీహాదీ ఒలింపిక్స్ పోటీలకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో పోస్ట్ అయ్యాయి. -
జిహాదీలను ఎదిరించి, సైన్యాన్ని రక్షించిన శునకం!
లండన్ః బ్రిటిష్ సైన్యాన్ని రక్షించిన మిలటరీ డాగ్ ఇప్పుడు వార్తల్లో హీరో అయిపోయింది. ఏభైమంది ఐసిస్ సమూహాన్ని దీటుగా ఎదుర్కొని బ్రిటిష్ ప్రత్యేక దళాలపై విశ్వాసాన్ని చూపింది. సాస్ సైనికులు పది రోజుల ట్రైనింగ్ అనంతరం తిరిగి వస్తుండగా.. ఫైటర్లనుంచి రక్షించి ప్రత్యేకతను చాటింది. నాలుగు వాహనాల కాన్వాయ్ లో బ్రిటిష్ సైనిక దళాలతో పాటు ప్రయాణిస్తున్న అల్సేషన్ డాగ్... కుర్షిద్ సరిహద్దు ప్రాంతంలోకి రాగానే అనుకోకుండా జిహాదీల సమూహానికి చిక్కారు. గతనెల్లో సుమారు ఏభైమంది ఐసిస్ సభ్యులు ఓ హోం మేడ్ బాంబుతో సైన్యంపై దాడికి దిగారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సైన్యంపై వెనుకనుండి దాడి చేశారు. అదే సమయంలో కాన్వాయ్ లో సైనికులతో పాటు ప్రయాణిస్తున్న మిలటరీ డాగ్ తన ప్రతాపం చూపింది. కోపంతో ఉగ్రరూపం దాల్చింది. ఐసిస్ దళాలపై విరుచుకు పడింది. ఓ జిహాదీని మైడపైనా, ముఖంపైనా కరిచింది. మరో జిహాదీ చేతులు, కాళ్ళను పట్టుకు పీకేసింది. ఆల్సేషన్ కుక్క టెర్రర్ కు ఐసిస్ సభ్యులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశారు. కుక్క భయానికి అక్కడినుంచీ పారిపోయారు. ఐసిస్ దాడులనుంచి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోకుండా.. ఆ కుక్క వీరోచితంగా పోరాడి తమ సైనికులను రక్షించడం అభినందించాల్సిన విషయమని, అందుకు దానికి ఎంతో తర్ఫీదు ఇచ్చి ఉంటారని ఘటన అనంతరం అంతా మెచ్చుకున్నారు. ఆల్సేషన్ దగ్గరకు వస్తే సాధారణ మనుషులైతే భయపడతారు. కానీ జిహాదీలను సైతం తీవ్రంగా భయపెట్టి, వారిని దీటుగా ఎదుర్కొని తన బాధ్యతను నిర్వర్తించడం నిజంగా ఆశ్చర్యకరమని అంటున్నారు. -
ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!
బ్రసెల్స్ బాంబర్ సోదరులు విమానాశ్రయంలో క్లీనర్లుగా పనిచేశారా? ఇబ్రహిం, ఖలీద్ ఎల్ బాక్రాయిలకు టెర్మినల్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉందా? వీరిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నారా? ఇలా ఉత్పన్నమౌతున్న ఎన్నో అనుమానాలు ఒక్కొక్కటే నిజమౌతున్నాయి. విమానాశ్రయాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆ జిహాదీ సోదరులు టెర్మినల్‌లో క్లీనర్లుగా పనికి చేరినట్లు స్వయంగా వారి మేనమామ తెలపడం ఆ అనుమానాలను నిజం నిజం చేస్తోంది. ఇబ్రహీం, ఖలీద్ ఎల్ బక్రాయి బ్రసెల్స్ ఉగ్రదాడులకు ముందే వ్యూహం పన్నినట్లు తాజాగా తెలుస్తోంది. విమానాశ్రయాన్ని నాశనం చేయాలన్న లక్ష్యంతోనే వారిద్దరూ అక్కడ క్లీనర్స్ గా చేరి, సెక్యూరిటీ చెక్ ల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో క్షుణ్ణంగా పరిశీలించారని తెలుస్తోంది. ఆ సోదరులిద్దరూ కనీసం పాఠశాల చదువు కూడా పూర్తి చేయలేదని, ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ క్లీనర్స్ గా చేరారని, వేసవికాలంలో ఎయిర్ పోర్టు శుభ్రం చేసే పనిలో ఉన్నారని వారి మేనమామ తెలిపారు. ఈ సోదరులిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయాన్ని పరిశీలించిన బెల్జియన్ ప్రాసిక్యూటర్ ఒకరు తెలిపారు. ఇబ్రహీం గతంలో రెండుసార్లు బహిష్కరణకు గురైనట్లు వెల్లడించినా, అతడు ఐసిస్ మోజులో ఉన్నాడని తెలిపినా తమ హెచ్చరికలను బెల్జియం విస్మరించిందని టర్కిష్ అధికారులు కూడా అంటున్నారు. గత జూలైలో ఓ టర్కిష్ పోలీసును ఇబ్రహీం కాల్చి చంపేశాడని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్జియం హోం, న్యాయశాఖ మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధానమంత్రి వారిని వారించారు. విపత్కర పరిస్థితుల్లో రాజీనామా సరైన నిర్ణయం కాదంటూ వారిని అంగీకరించలేదు. 29 ఏళ్ళ ఇబ్రహీం, బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ ఇద్దరూ జావెంటెమ్ ఎయిర్ పోర్టులో సూట్ కేస్ బాంబు పేల్చి బీభత్సం సృష్టించారు. బాంబు పేలే సమయానికి వారు చేతులకు గ్లౌజెస్ పెట్టుకుని తమ ట్రాలీలను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోందని, వారి పక్కనే టోపీ పెట్టుకుని ఓ తెల్లజాతి వ్యక్తి సీసీటీవీలో కనిపించాడని, అతడికి చెందిన బాంబు పేలకపోవడంతో అక్కడినుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అమెరికా అధికారులు కూడా అతడు అమెరికా వాచ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఉగ్రదాడి జరిగిన కొద్ది సేపటికే మీల్ బీక్ స్టేషన్లో బాంబు దాడికి పాల్పడిన ఖలీద్ అక్కడినుంచి కూడా తప్పించుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ జిహాదీ సోదరులిద్దరూ పాఠశాల స్థాయి వరకూ బాగానే చదివినా.. ఆ తర్వాత వారిద్దరికీ నేర చరిత్ర తీవ్రంగానే ఉంది. ఇద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. అదే నేపథ్యంలో వారు ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని ముందుస్తు అంచనాతోనే అక్కడ క్లీనర్స్ గా పనికి చేరి ఉండొచ్చని వారి మేనమామ చెబుతున్నారు. జైలుశిక్ష అనుభవించిన అనంతరం వారిలో తీవ్ర మార్పు కనిపించిందని, హుందాగా కనిపించడం, వస్త్రధారణలో వచ్చిన మార్పులతో పాటు ఇబ్రహీం ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తుండేవాడని ఇదంతా చూస్తే వారు తిరిగి ఇలాంటి చర్యకు పాల్పడతారని ఊహించలేదని వారి మేనమామ విచారణలో వెల్లడించాడు. కాగా ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం ఆ సోదరులిద్దరూ విమానాశ్రయంలో క్లీనర్స్ గా పనిచేశారా లేదా అన్నది ఇంకా నిర్థారించలేదు. మరోవైపు బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ సోదరుడు మౌరాద్ లాచ్రౌ మాత్రం తమ అన్న మూడేళ్ళ క్రితం సిరియా పారిపోయినప్పటినుంచీ అతడితో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, సూసైడ్ బాంబర్స్ తీరు ఎంతో సిగ్గుగా, బాధగా అనిపించిందని తెలిపారు.