వైమానికదాడుల్లో ముగ్గురు పౌరులు మృతి
వైమానికదాడుల్లో ముగ్గురు పౌరులు మృతి
Published Fri, Sep 16 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
సిరియా: సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందారు. ఇడ్లిబ్ ప్రావిన్స్లోని ఖాన్ షేకున్ ప్రాంతంలో తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సైతం మృతి చెందారని, మరో 13 మంది పౌరులు గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్రైట్స్(ఎస్ఓహెచ్) వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆధీనంలో లేని ప్రాంతంలో జరిగిన వైమానికదాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందడం ఇదే తొలిసారి అని ఎస్ఓహెచ్ ప్రతినిధి అబ్దుల్ రెహ్మాన్ వెల్లడించారు.
దాడులకు పాల్పడిన వైమానిక విమానాలు ఏ దేశానికి చెందినవి అన్నది మాత్రం ఎస్ఓహెచ్ గుర్తించలేకపోయింది. అయితే, ఇడ్లిబ్ ప్రాంతంలో సిరియా ప్రభుత్వానికి అనుకూలంగా రష్యా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించడం సర్వసాధారణం అని తెలుస్తోంది.
Advertisement
Advertisement