మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించాడు. రష్యా ఆర్మీ వద్దసెక్యూరిటీ హెల్పర్‌గా పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్(23) ఈ నెల 21న ఉక్రెయిన్ జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందాడు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని భారత్‌కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ సమీర్ అహ్మద్ తెలిపారు.
అయితే హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారత యువకులను ఉక్రెయిన్‌తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని రష్యా బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే హేమిల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడు.
గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. .
Comments
Please login to add a commentAdd a comment