న్యూయార్క్ : దశాబ్ధ కాలంగా భారత్ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి అయింది.
మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘అందరికీ శుభవార్త.. మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు’ అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.
Big,small, all join together.
— Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019
Masood Azhar designated as a terrorist in @UN Sanctions list
Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism
Comments
Please login to add a commentAdd a comment