పట్నా: ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా విషయం తెలిసిందే. దీనిపై బీజేపీనే కాక సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఎఎఫ్ దాడులపై కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఆపార్టీ బిహార్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. ‘‘వైమానిక దళాలు జరిపిన దాడులకు కాంగ్రెస్ పార్టీ ఆధారాలు అడిగింనందుకు ఆపార్టీ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా. పార్టీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నా’’అని ఆనంద్ శర్మ తెలిపారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పంపినట్లు శర్మ వెల్లడించారు.
ఐఎఎఫ్ దాడులపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు జరిపాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సరైన ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం విధితమే. సైనికుల త్యాగాలను ప్రధాని మోదీ రాజకీయంగా ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శించగా.. జవాన్లను అవమానించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బీజేపీ ప్రతివిమర్శలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment