సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (ఫైల్)
లక్నో: బీజేపీ భారత ఆర్మీలా వ్యవహరించడం మానాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శుక్రవారం మండిపడ్డారు. ఆర్మీని అవమానిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ ప్రభుత్వం ఆర్మీలా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. తమనెవరూ ప్రశ్నించొద్దని భావించే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమైనవ’’ని మోదీకి ఘాటుగా జవాబిచ్చారు.
ఇదిలా ఉండగా.. ‘‘పుల్వామా లాంటి దాడులు కాంగ్రెస్ హయాంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వంలో కూడా పలుమార్లు జరిగాయి. 2008లో ముంబైలో ఉగ్రదాడి జరిగినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం పాక్‌పై సైనిక యుద్ధ విమానాలను పంపింది. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్‌పై దాడి చేయడాన్ని సరైన చర్యగా తాను భావించలేద’’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జవాబుగా మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. ‘కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు అందరికీ తెలిసినవే. ఉగ్రవాదులకు దీటుగా కాంగ్రెస్ ఎప్పుడూ బదులివ్వలేదు. కానీ ఇది నూతన భారతదేశం. మేం టెర్రరిస్టులకు వారి భాషలో వారికి అర్థమయ్యేలా సరైన జవాబులు ఇవ్వగలమని పరోక్షంగా ప్రతి దాడులు చేస్తామ’ని మోదీ విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment