
ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : కశ్మీర్ సరిహద్దుల వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ మరో దుందుడుకు చర్యకు పాల్పడినట్లు సమాచారం. కశ్మీర్‌తో పాటు రాజస్తాన్‌లోని భారత్- పాకిస్తాన్ సరిహద్దుల కూడా దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతోంది. డ్రోన్ల ద్వారా భారత సైనిక రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించి ఇప్పటికే రెండుసార్లు విఫలమైనా పాక్ బుద్ధి మాత్రం మారలేదు. ఈ క్రమంలో శనివారం మరోసారి రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్ సెక్టార్ గుండా భారత గగనతలంలోకి పాక్ డ్రోన్ ప్రవేశించగా.. భారత సైన్యం దానిని కూల్చివేసింది.(చదవండి : తీరు మారని పాక్.. సరికొత్త నాటకాలు!!)
కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం భారత గగన తలంలోకి ప్రవేశించేందుకు పాక్ డ్రోన్లు ప్రయత్నించడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని కచ్, మార్చి 4న రాజస్తాన్‌లోని బికనీర్ సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించాలని చూసిన పాక్ డ్రోన్లను నేలకూల్చి భారత సైన్యం దీటుగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment