జైపూర్: పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ మిలటరీకి చెందిన డ్రోన్ శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించిందని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజస్తాన్‌లోని హిందుమాల్‌కోట్‌లోకి పాక్ డ్రోన్ రావడంతో బీఎస్‌ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్ వెనక్కు మళ్లింది. కాగా, నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది.
ఉదయం పదింటికి అఖ్నూర్ సెక్టార్‌లో నంద్వాల్‌చౌక్ వద్ద రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)ను సైన్యం గుర్తించింది. వెంటనే ఆప్రాంతంలోని వారిని ఖాళీచేయించి ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో అలాంటివి ఇంకా ఏమైనా అమర్చారా అనే అనుమానంతో బలగాలు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు అమర్చిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment