కాల్పులకు దిగిన పాక్‌..జవాను మృతి | Soldier Killed In Rajouri In As Pak Army Violates Ceasefire | Sakshi
Sakshi News home page

కాల్పులకు దిగిన పాక్‌..జవాను మృతి

Mar 21 2019 3:16 PM | Updated on Mar 21 2019 3:19 PM

Soldier Killed In Rajouri In As Pak Army Violates Ceasefire - Sakshi

శ్రీనగర్‌ : దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో భారత జవాను యశ్‌ పాల్‌(24 ) ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌పై మెరుపు దాడుల నేపథ్యంలో భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్‌ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో జనవరి నాటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 110 సార్లు కాల్పులకు తెగబడింది.

ఇదిలా ఉండగా.. గత సోమవారం నియంత్రణ రేఖ వెంబడి అఖ్‌నూర్‌, సుందర్‌బనీ సెక్టార్లలో పాక్‌ సైన్యం బాంబులతో విరుచుకు పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో కరమ్‌జీత్‌ సింగ్‌ అనే జవాను మరణించారని పేర్కొన్నారు. గతేడాది పాక్‌ 2936 సార్లు కాల్పులకు దిగిందని, గత పదిహేనేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement